బ్రేకింగ్: కేంద్రంలో వైసీపీ, టీడీపీ ఎంపీలకు కీలక బాధ్యతలు..!

Thursday, July 11th, 2019, 07:50:06 PM IST

ఏపీ లోక్‌సభ ఇద్దరు ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం కీలక పదవులు కట్టబెట్టింది. పార్లమెంట్‌లోని ఎస్టిమేట్ కమిటీ సభ్యుల పదవులకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 31 మంది ఎంపీలు నామొనేషన్లు వేశారు. అయితే అందులో ఇద్దరు ఎంపీలు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ పదవులలో కేంద్ర ప్రభుత్వం ఏపీ నుంచి ఇద్దరు ఎంపీలకు చోటు కల్పించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం కల్పించగా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి అవకాశం కల్పించారు. అయితే ఈ కమిటీలో ఉన్న సభ్యులు కేంద్రం యొక్క వార్షిక బడ్జెట్ అంచనాలను పరిశీలన చేసుకుని వార్షిక వ్యయంలో పొదుపు అంశాలపై ప్రభుత్వానికి తమవంతు సలహాలు, సూచనలు అందించాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ 30వరకు ఈ కమిటీ కొనసాగుతుంది. అయితే ఇంతకు ముందే కేంద్రం వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసినా ప్రత్యేక హోదా విషయంలో దానిని పక్కన పెట్టింది. అయితే ఆ తరువాత మరోసారి రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్యానల్ లోక్ సభ స్పీకర్‌గా కేంద్రం నియమించింది. దానికి వైసీపీ ఒకే చెప్పడం మిథున్ రెడ్ది ప్యానల్ స్పీకర్‌గా భాధ్యతలు చేపట్టడం కూడా జరిగిపోయింది. అయితే కేంద్రం వైసీపీకి మరోసారి ఎస్టిమేట్ కమిటీ సభ్యులలో కూడా స్థానం కల్పించింది. అయితే వైసీపీ ప్రభుత్వం దీనికి ఒకే చెబుతుందా లేదా అనేది మత్రం తెలియాల్సి ఉంది.