ఎన్టీఆర్ పేరును పూర్తిగా చెరిపేసే ప్రయత్నాల్లో వైకాపా

Thursday, July 11th, 2019, 04:33:07 PM IST

అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా మొదట చేసే పని గత ప్రభుత్వం యొక్క గుర్తులేవీ తమ పాలనలో లేకుండా చూసుకోవడం. ప్రస్తుతం వైకాపా కూడా అదే పని చేస్తోంది. ఈ పద్దతితో దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు కనుమరుగయ్యే పరిస్తితి తలెత్తింది. చంద్రబాబు తన హయాంలో చాలా పథాలకు ఎన్టీఆర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకున్నారు. దీంతో అక్కడే పెద్దాయన పేరు సగం కనుమరుగైంది.

ఇక మిగిలిన సగాన్ని వైకాపా లేకుండా చేస్తోంది. ఎన్టీఆర్ పేరు మీద గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లపై వైకాపా కన్నువేసింది. సరిగా నడవట్లేదు, ఎక్కువమంది వినియోగింట్లేదు అనే సాకుతో కొన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. చిత్తూరు, మదనపల్లె, పుంగనూరు, శ్రీకాళహస్తి, పలమనేరు ప్రాంతాల్లో ఉన్న క్యాంటీన్ల తొలగించాలని డిసైడ్ అయింది. ఇదే గనుక జరిగితే జనంలో అంతంతమాత్రమే ఉన్న ఎన్టీఆర్ పేరు వినిపించకుండాపోయే ప్రమాదముంది.