ఇదేమి టీజర్రా బాబు..ఏది క్లియర్ గా లేదు!

Tuesday, February 20th, 2018, 05:11:18 PM IST

అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం హిట్టు అందుకునే పనిలోనే ఉన్నాడు. కెరీర్ లో మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకోవాలని గత కొంత కాలంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ విజయాలను మాత్రం అందుకోవడం లేదు. చివరగా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఒక్క క్షణం కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే అలా అయితే సెట్ అవ్వదేమో అనుకున్నాడేమో గాని మళయాళంకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ మోహన్ లాల్ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు.

1971 భారత సరిహద్దు నేపథ్యంలో తెరకెక్కిన యుద్దభూమి అనే ఆ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అయితే సినిమా టీజర్ అసలు ఒరిజినల్ దేనా అనే అనుమానం కలుగుతోంది. సాధారణంగా టీజర్ చూస్తే కొన్ని విషయాలు అర్థంకాకపోయినా కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించాలి. అసలు మెరుపు తీగలాగా ఆ షాట్స్ ఏంటో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. టైటిల్ తప్ప ఏది అర్ధం కావడంలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆడియెన్స్ తో ఇలా ఎందుకు ఆడుకుంటారో అంటూ కొంచెం కొత్తగా ఇవ్వండి బాబూ అని మరికొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.