సినిమా నిర్మాతగా మారిన క్రేజీ సంగీత దర్శకుడు ?

Sunday, September 16th, 2018, 11:33:18 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అంటే ఒక్క తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి క్రేజ్. అయన సంగీతంలో వచ్చిన తెలుగు సినిమాలు, తమిళ డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ మంచి క్రేజ్ దక్కింది. తాజాగా అయన నిర్మాతగా మారాడు. ప్యార్ ప్రేమ కాదల్ పేరుతొ ఓ సినిమాను నిర్మించాడు .. ఇటీవలే విడుదలైన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా పై యువన్ పెట్టుకున్న నమ్మకం నిజం అవ్వడంతో అయన తెలుగులో కూడా విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో ఇకపై వరుసగా సినిమాలు నిర్మించేందుకు రెడీ అయ్యాడు. తన నెక్స్ట్ సినిమాను కూడా తమిళ తెలుగు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నాడట. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ మీదున్న అయన ఇకపై నిర్మాతగా కూడా బిజీ అయ్యేలా ఉన్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments