క్రికెట్ నుంచి తప్పుకుంటూనే..యువీ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్.!

Monday, June 10th, 2019, 04:09:05 PM IST

యావత్తు క్రికెట్ అభిమానులకు ఈ రోజు భారత్ ప్రముఖ అగ్రెస్సివ్ క్రికెటర్ అయినటువంటి యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ ను ప్రకటించి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ఇచ్చిన ప్రకటన ఇప్పుడు యువీ సహా క్రికెట్ అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేసింది.ఈ రోజే అధికారికంగా యువరాజ్ తన క్రికెట్ జీవితానికి స్వస్తి చెప్తున్నానని ఒక అద్భుత నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు.దీనికి మాత్రం ప్రతీ ఒక్కరు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని చెప్పాలి.ఇప్పటి వరకు యువరాజ్ భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను సేవలను అందించాడు.మధ్యలో క్యాన్సర్ వ్యాధి భారిన పడినా సరే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారత అభిమానుల కలలు కన్న ప్రపంచ కప్ ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇలా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన యువీ మధ్యలో ఫామ్ కోల్పోయాడు అన్న సమయంలో ఏకంగా 2017లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 150 పరుగులు కొట్టి అందరి నోర్లు మూయించాడు.మొట్టమొదటి సారిగా 6 బాల్స్ కు 6 సిక్సులు బాది మరో రికార్డు నెలకొల్పాడు.ఇన్ని చేసిన యువరాజ్ ఇక నుంచి తన శేష జీవితాన్ని నిస్సహాయ పసి పిల్లలకు మరియు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఎప్పుడు తోడుగా ఉండి సాయం చేస్తా అని ప్రకటించారు.ఇది మాత్రం ప్రతీ ఒక్కరి కళ్ళలో నీళ్లు తెప్పించే విషయమే అని చెప్పాలి.యువరాజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి సక్సెస్ అవ్వాలని ఇప్పుడు యావత్తు భారత ప్రజానీకం యువరాజ్ కు నీరాజనం పడుతున్నారు.