“నాలో.. నాతో వైఎస్సార్” PDF ఫేక్.. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ..!

Sunday, July 12th, 2020, 01:57:27 AM IST


ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన “నాలో.. నాతో వైఎస్సార్” పుస్తకాన్ని కుమారుడు సీఎం జగన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

అయితే వైఎస్ విజయమ్మ రాసిన “నాలో.. నాతో వైఎస్సార్” పుస్తకం పేరుతో సర్క్యులేట్ అవుతున్న నకిలీ PDF పట్ల జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నకిలీ PDF ఫైల్ సామాజిక మాద్యమాల్లో సర్క్యూలేట్ చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకానికి దీనికి సంబంధం లేదని, ఎమెస్కో పబ్లిషర్స్ ప్రింట్ చేసిన పుస్తకమే అసలైన పుస్తకమని తేల్చి చెప్పారు.