టీటీడీ ఆస్తులపై సంచలన నిర్ణయం తీసుకున్న వైవీ.సుబ్బారెడ్డి..!

Friday, May 29th, 2020, 01:06:46 AM IST

టీటీడీ ఆస్తులు, భూముల వేలం వివాదం గత కొద్ది రోజులుగా ఏపీలో తీవ్ర కలకలం రేపుతుంది. అయితే తాజాగా టీటీడీ ఆస్తులపై టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అయిత్గే టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, టీటీడీ భూములలో వివిధ దశల్లో విక్రయించినవి, ఆక్రమణకు గురైనవి, అందుబాటులో ఉన్న ఆస్తుల సమగ్ర సమాచారం శ్వేత పత్రంలో ఉండాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. టీటీడీకి దాతలు ఇచ్చిన భూములు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని లేకపోతే కోర్టులో కేసులు వేయాలని అధికారులను వైవీ.సుబ్బారెడ్డి ఆదేశించారు.