నేను హిందువే.. క్రిస్టియన్ కాదు !

Friday, June 7th, 2019, 11:18:19 PM IST

వైకాపా కీలక నేత, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి దాదాపు ఖాయమైపోయింది. కానీ సుబ్బారెడ్డి క్రైస్తవ మతస్థుడని, ఒక హిందువుకు కాకుండా టీటీడీ చైర్మన్ పోస్ట్ క్రైస్తవునికి ఎలా ఇస్తారని అనేక వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. సోషల్ మీడియాలో కొందరు సుబ్బారెడ్డి వికీ పీడియా పేజ్ బయటకు తీసి అందులో ఆయన మతం క్రైస్తవం అని ఉండటాన్ని చూపించి ప్రశ్నిస్తున్నారు.

దీంతో బయటికొచ్చిన సుబ్బారెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తాను క్రిస్టియన్ కాదని, హిందువునని, తన ఇష్ట దైవం వెంకటేశ్వరస్వామి అని అన్నారు. జగన్ తనకు టీటీడీ చైర్మన్ భాద్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని స్వామికి సేవ చేసుకునే అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అంతేకాదు భవిష్యత్తులో జగన్ ఎలాంటి భాద్యత ఇచ్చినా నెరవేర్చడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. మరి ఈ క్లారిటీతో అయినా హిందూ సంఘాలు శాంతిస్తాయో లేదో చూడాలి.