వావ్.. ధోనికి డిఫెరెంట్ విషెస్ తో షాకిచ్చిన జీవా!

Sunday, July 8th, 2018, 12:35:58 AM IST

ఎలాంటి పరిస్థితుల్లో అయినా మ్యాచ్ స్వరూపాన్నే తన ఆలోచనలతో మార్చేయగల ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ రోజు ధోని పుట్టిన రోజు కావడంతో ప్రపంచ క్రికెట్ దిగ్గజాల నుంచి క్రికెట్ అభిమానుల వరకు అందరి నుంచి విషెస్ అందుతున్నాయి. ఇకపోతే రీసెంట్ గా బిసిసిఐ నుంచి అందిన విషెస్ మాత్రం మరింత స్పెషల్ గా ఉందని చెప్పాలి. అధికారిక వెబ్ సైట్ లో అందుకు సంబందించిన వీడియో ను పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలో రోహిత్ శర్మ కోహ్లీ హార్దిక్ పాండ్య శిఖర్ ధావన్ ఉమేష్ యాదవ్ తో పాటు ఇతర ఆటగాళ్లు వారి విషెష్ తెలుపగా చివరగా ధోని గారాల కూతురు జీవా డిఫెరెంట్ గా తన తండ్రికి విషెష్ చెప్పింది.
‘హ్యాపీ బర్త్‌ డే పాపా..యూ ఆర్‌ గెటింగ్‌ ఓల్డ్‌’ అని పాట పాడుతూ చెప్పడం హైలైట్‌గా నిలిచింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments