తెలంగాణా పార్టీలలో కీలక పాత్ర పోషించనున్న పరిషత్ ఫలితాలు.!

Tuesday, June 4th, 2019, 10:27:17 AM IST

తెలంగాణలోని గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెరాస పార్టీ ఊహించని విజయాన్ని నమోదు చేసుకోగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఊహించని ఫలితాలనే చూడాల్సి వచ్చింది.దీనితో అక్కడ జరిగిన నష్టాన్ని తెరాస పార్టీ ఈసారి పరిషత్ ఎన్నికల్లో పూడ్చాలని అనుకుంటున్నారు.అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్న బీజేపీ మరియు టీకాంగ్రెస్ లు మాత్రం మునుపటి జోరునే కొనసాగించాలని అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా గత మే నెలలో మూడు దశలు వారీగా జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఈ రోజే విడుదల కావస్తుండడంతో తెలంగాణలోని ప్రజలతో పాటుగా అక్కడి పార్టీలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఉదయం 8 గంటలకు మొదలైన లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 128 కౌంటింగ్ కేంద్రాలలో 978 హాళ్లలో ఈ ప్రక్రియ జరగనుంది.అలాగే ఈసారి మొత్తం 538 జడ్పీటీసీ 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగగా జడ్పీటీసీ లకు 2,426 మంది అలాగే ఎంపీటీసీ లకు 18,930 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.దీనితో ఫలితాలు ఎలా వస్తాయి అన్నది అక్కడ రాజకీయ వర్గాల్లో కీలకంగా మారింది.