ప్రస్తుతానికి తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.!

Tuesday, June 4th, 2019, 01:20:09 PM IST

ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే గత నెలలో జరిగిన తెలంగాణా జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల తాలూకా ఫలితాలు మధ్యాహ్న సమయానికి అక్కడ పోటీ చేసిన పార్టీలలో మరింత ఆసక్తిని రేపుతున్నాయి.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 128 కౌంటింగ్ కేంద్రాలలో 978 హాళ్లలో కౌంటింగ్ కొనసాగుతుండగా మొత్తం 538 జడ్పీటీసీ 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి.అయితే ప్రస్తుతానికి మాత్రం 5817 ఎంపీటీసీ లకు గాను 2436 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి.వీటిలో ఆయా పార్టీలకు సంబంధించి ఫలితాలు ఈ విధంగా వచ్చాయి.తెరాస 1584, కాంగ్రెస్‌ 502, బీజేపీ 99, ఇతరులు 251 చోట్ల విజయం సాధించగా 538 జెడ్పీటీసీ లకు మాత్రం 5 చోట్ల ఫలితాలు బయటకు వచ్చాయి.వీటిలో తెరాస ఇతర పార్టీలకు ఎక్కడా తావివ్వకుండా 5 స్థానాలను కైవసం చేసుకుని ముందజలో ఉంది ఇంకా కాంగ్రెస్ మరియు బీజేపీలు ఖాతా తెరవాల్సి ఉంది.