పోల్ : ఏపీ సీఎం జగన్ చెప్పినట్టు ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగలడా?

Monday, June 3rd, 2019, 01:27:18 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ నాలు రోజుల క్రితం ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జగన్ మాట్లాడుతూ అందరికి దిమ్మ తిరిగే ప్లాన్‌ని భయట పెట్టేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటానికే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇలాంటి తరుణంలో జగన్ ఆగస్టు 15లోగా 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇది విన్న అందరూ ఒక్క సారిగా షాక్‌కి గురయ్యారు. మూడు నెలలలో 4 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు అనేదానిపై ఇప్పుడు అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా లేదా అనేది ఆగస్టు 15న తేలిపోనుంది.