పోల్ : ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ “ప్రత్యేక హోదా” తీసుకువస్తారా?

Saturday, June 8th, 2019, 04:24:46 PM IST

వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకుంటానని చెప్పిన విధంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయ వర్గాల్లో సరికొత్త అడుగులు వేస్తూ విశ్లేషకుల మన్ననలు పొందుతున్నారు.రాబోయే రోజుల్లో జగన్ ముందున్న అతిపెద్ద సవాల్ ఏదన్నా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి “ప్రత్యేక హోదా” తీసుకురావడం అనే చెప్పాలి.

మొదటి నుంచి జగన్ ఒకే స్టాండ్ మీదున్నా ఆ తర్వాత మాత్రం ఈ అంశంపై కాస్త తేడాగా మాట్లాడారు.అయినా సరే కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చి హోదాను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకువస్తానని చెప్తున్నారు..కానీ బీజేపీకి చెందిన నేతలు మాత్రం ప్రత్యేక హోదా ఒక ముగిసిపోయిన అధ్యాయం అని అది ఇచ్చేది లేదు అని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మి నారాయణ ఇటీవలే చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.మరి వీటన్నిటికీ అతీతంగా జగన్ హోదా తీసుకొస్తారా అంత సీనుందా అన్నది మీరే ఈ కిందున్న ఆప్షన్స్ ద్వారా పోల్ చేసి అభిప్రాయాన్ని తెలియజేయండి.