మూవీ రివ్యూ : “యాక్షన్”

అటు తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో విశాల్ కూడా ఒకరు.ఇప్పుడు విశాల్ హీరోగా తమన్నా మరియు ఐశ్వర్య లక్ష్మిలు హీరోయిన్లుగా దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ ఆన్ యాక్షన్ డ్రామా చిత్రం “యాక్షన్”. టీజర్ మరియు ట్రైలర్లతో యాక్షన్ చిత్రాల ప్రియులను మెప్పించిన ఈ చిత్రం ఈ రోజే రెండు భాషల్లో కూడా విడుదల అయ్యింది.మరి ఈ చిత్రం ఎంత వరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే విశాల్ ఒక ముఖ్యమంత్రి కొడుకు.అయితే విశాల్ కుటుంబంపై కొంత మంది పాకిస్థానీ ఉగ్రవాదులు బాంబు దడి చేసి వారిని చంపేస్తారు.ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది.అసలు విశాల్ కుటుంబాన్ని ఎవరు టార్గెట్ చేసారు?టార్గెట్ చేసింది విశాల్ నా లేక అతని కుటుంబాన్నా?అసలు ఈ ఉగ్రవాదుల వెనుక ఉండి నడిపిస్తుంది ఎవరు?అతన్ని విశాల్ పట్టుకోగలిగాడా?మరి ఈ కథకు తమన్నాకు ఉన్న సంబంధం ఏమిటి?కేవలం టైటిల్ లోనే ఉన్న యాక్షన్ ఫుల్ లెంగ్త్ మూవీలో కూడా ఉందా లేదా అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

విశ్లేషణ :

మొట్టమొదటగా చెప్పాలంటే ముమ్మాటికీ సినిమా టైటిల్ కు చిత్ర యూనిట్ పూర్తి న్యాయం చేసింది.సినిమా మొదలయ్యినప్పటి నుంచి కూడా ఆసక్తికర కథనంతో చాలా గ్రిప్పింగ్ నరేషన్ తో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతుంది.అలాగే సాంగ్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ లో చూపించే విజువల్స్ కానీ లొకేషన్స్ కు తగ్గట్టు డిజైన్ చేసుకున్న ఎపిసోడ్స్ కానీ అదిరిపోతాయి.ముఖ్యంగా యాక్షన్ సినిమా లవర్స్ మరియు తెలుగు ప్రేక్షకులకు అయితే ఇవి మరింత థ్రిల్ ఇస్తాయి.

అలాగే కథానుసారం కొనసాగే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ సినిమా చూసే ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి.అదే విధంగా హీరో విశాల్ ను ఈ చిత్రంతో తనని తాను పూర్తి యాక్షన్ హీరోగా మలచుకున్నారు.ఈ చిత్రం ద్వారా అటు తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులు ఒక కొత్త విశాల్ ను చూడడం ఖాయం అని చెప్పాలి.అలాగే తమన్నాకు దర్శకుడు సుందర్ మంచి కీ రోల్ ఇచ్చారు దీనికి ఆమె పూర్తి న్యాయం చేసింది అలాగే మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది.

ఇక దర్శకుడు సుందర్ సి పనితనంకి వచ్చినట్టయితే ఎంచుకున్న లైన్ కి తగ్గట్టుగా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఎపిసోడ్ లు జోడించడం చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలిచింది.ఫస్టాఫ్ అంతా గ్రిప్పింగ్ నరేషన్ ఆసక్తికర సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించగలుగుతారు.అలాగే సెకండాఫ్ విషయానికి వచ్చినట్టయితే ప్రీ క్లైమాక్స్ వరకు ఫస్టాఫ్ లానే ఇంట్రెస్టింగ్ గా సాగించినా మెల్లమెల్లగా ప్రీ క్లైమాక్స్ కి వచ్చే సరికి కథ మొత్తం తెలిసినట్టుగానే ఇది వరకు చూసిన చాలా సినిమాల్లానే అనిపిస్తుంది.

ఇదే చిత్రానికి పెద్ద మైనస్ అయ్యింది.అలాగే క్లైమాక్స్ కూడా పర్వాలేదనిపిస్తుంది.ఇక ఇతర టెక్నిషియన్స్ విషయానికి వచ్చినట్టయితే యాక్షన్ సీన్స్ మరియు సాంగ్స్ లో డుడుల్ అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా అద్భుతంగా ఉంది.అలాగే సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజా అందించిన సాంగ్స్ పర్వాలేదనిపించినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మాత్రం తమ మార్క్ కనిపిస్తుంది.అలాగే ట్రిడెంట్ ఆర్ట్స్ వారి నిర్మాణ విలువలు ఎక్కడా తక్కకుండా చాలా సినిమాకు ఎంతలో కావాలో అంతలో ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

విశాల్ పెర్ఫామెన్స్
ఫస్ట్ హాఫ్
హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్

 

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
రొటీన్ టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే విశాల్ నటించిన ఈ “యాక్షన్” తెలుగు ప్రేక్షకులకు మరియు ఇలాంటి చిత్రాలను ఇష్టపడేవారికి ఒక కొత్త అనుభూతి ఇవ్వడం ఖాయం.కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి మాత్రం అప్పటి వరకు ఆసక్తికరంగా కొనసాగిన కథనం అంతా పరమ రొటీన్ స్టోరీల్లానే అనిపించడం మైనస్ అయ్యింది.స్టోరీ విషయం పక్కన పెట్టి మంచి యాక్షన్ థ్రిల్లర్ ను చూడాలనుకుంటే విశాల్ “యాక్షన్” మూవీ మీకు ఈ వారాంతానికి మంచి ఛాయిస్ గా నిలవొచ్చు.

Rating : 3/5