మూవీ రివ్యూ : “అల వైకుంఠపురములో”

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా టబు,జైరాం అలాగే సుషాంత్ మరియు నివేత పేతురాజ్ వంటి నటుల కలయికలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన “అల వైకుంఠపురములో” చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ తో ఈరోజే విడుదలైంది.బన్నీ మరియు త్రివిక్రమ్ ల మూడో చిత్రం అనే కాకుండా మ్యూజికల్ గా ముందే పెద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చి వెండితెరపై ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథ లోకి వెళ్లినట్టయితే బంటు(అల్లు అర్జున్) ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో పెరిగిన అబ్బాయి.చిన్నప్పటి నుంచీ అలాగే పెరిగిన బంటుకు అసలు ఎవరో కూడా తెలీని గొప్ప కుటుంబానికి చెందిన టబు మరియు జైరాం ల కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి?ఈ కథలో అమూల్య(పూజా హెగ్డే)పాత్రకు ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా?ఈ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బంటు “వైకుంఠపురము”లోకి ఎలా అడుగు పెట్టాడు.ఈ కథ వెనుక ఉన్న అసలు వృత్తాంతం ఏమిటి?దానిని త్రివిక్రమ్ ఎలా తీర్చిదిద్దారో తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై మిస్సవ్వకుండా చూడాల్సిందే.

విశ్లేషణ :

మన తెలుగు పరిశ్రమలో ఉన్న సెంటిమెంట్స్ ను త్రివిక్రమ్ మరియు బన్నీ ఈ చిత్రం ద్వారా బ్రేక్ చెప్పాలి.ఇది వరకు పవన్ తో తీసిన మూడు చిత్రాల్లో మూడోది అందులోను జనవరిలో విడుదల కావడంతో ఈ చిత్రానికి అదే గతి పడుతుంది అనుకున్న వారికి త్రివిక్రమ్ మరియు బన్నీలు చాచి పెట్టి గూబ మీద కొట్టేలా చేసారని చెప్పాలి.సినిమా మొదలయ్యినప్పటి నుంచి మంచి ఎక్కడా కూడా ఫ్లోను మిస్ చెయ్యకుండా త్రివిక్రమ్ ఒక్కో మెట్టును ఎక్కిస్తున్నట్టుగా తెరకెక్కించారు.అలా చిత్రం చూసే కొద్దీ మంచి ఆసక్తికరంగా అనిపిస్తుంది.

అలాగే మ్యూజికల్ గా ముందే బిగ్గెస్ట్ హిట్ అయిన ఈ చిత్రం వాటిని విజువల్ గా చూపించే క్రమంలో కూడా వండర్ చేసింది.ప్రతీ ఒక్క పాట కూడా ఊహలకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ తెరకెక్కించారు అంతే కాకుండా జులాయి చిత్రం తర్వాత ఈ చిత్రంలో బన్నీ కామికల్ టైమింగ్ ను మనం మరోసారి చూడొచ్చు.అలాగే త్రివిక్రమ్ సినిమా అంటేనే ఫలితంతో సంబంధం లేకుండా డైలాగులు కోసం ప్రతీ ఒక్కరూ అడుగుతారు.అలా ఈ చిత్రంలో త్రివిక్రమ్ పేల్చినా డైలాగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ లోని ఎమోషన్స్ కానీ ఈ చిత్రానికి నిర్మొహమాటంగా పెద్ద ఎస్సెట్ అని చెప్పొచ్చు.

అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ మరింత హై ను తీసుకొస్తుంది.ఇక సెకండాఫ్ లో కూడా గురూజీ ఎక్కడా తగ్గ లేదు.పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఫైట్ సీన్ అయితే మాస్ ప్రేక్షకులకు పండగే..ఇదే ఒకెత్తు అయితే మెగాస్టార్ మరియు ఇతర స్టార్ హీరోల సాంగ్స్ కు బన్నీ స్టెప్పులు వేసే ఎపిసోడ్ చూడాలి..ఇది మాత్రం అందరి హీరోల ఫ్యాన్స్ కు పండగే..అంతే కాకుండా కామెడీ మరియు ఎమోషన్స్ తెరకెక్కించిన విధానం మళ్ళీ పాత త్రివిక్రమ్ ను గుర్తుకు తెస్తుంది.

కానీ ఇక్కడే ఓ మైనస్ పాయింట్ ఏంటంటే గురూజీ ఈసారి కూడా సినిమా తాలూకా ప్రధాన ప్రతిబింబాన్ని ఎప్పటిదో సినిమా నుంచి తీసుకున్నదే.దానిని నేటి తరానికి తగ్గటుగా తీర్చి దిద్దారు.ఇదే కాస్త నిరాశ కలిగించే అంశం ఒకవేళ అది తెలీకుండా చిత్రం చూసిన వారికి మాత్రం నూటికి ఒక శాతం ఎక్కువే నచ్చుతుంది.ఇక నటీనటుల విషయానికి వస్తే బన్నీ కోసం ఇది వరకే చర్చించుకున్నాం.పూజా ఒక్క గ్లామర్ తోనే కాకుండా మరోసారి మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది.అంతే కాకుండా ఈ ఇద్దరి ఫైర్ మధ్య మ్యాజిక్ “డీజే” తర్వాత మరింత ఎక్కువగానే కనిపిస్తుంది.

అలాగే మురళీ శర్మ మంచి పాత్ర పోషించారు.టబు,జైరాం రోహిణీ లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు.అలాగే నివేత పేతురాజ్ మరియు సుషాంత్ లు కూడా మంచి రోల్స్ చేసారు.ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు థమన్ కోసం ప్రత్యేకంగా మాట్లాడి తీరాలి.ఇంతకు ముందు ఇదే త్రివిక్రమ్ తో ఏ ముహూర్తాన జర్నీ మొదలు పెట్టాడో కానీ అక్కడ నుంచి ఓ సరికొత్త థమన్ తనని తాను పరిచయం చేసుకున్నాడు.పాటలు కానీ బాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక రేంజ్ లో ఈ చిత్రానికి ఇచ్చాడు.ఇవి ఖచ్చితంగా సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అలాగే పి ఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.
ప్లస్ పాయింట్స్ :

బన్నీ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్
త్రివిక్రమ్ పెన్ పవర్
పాటలు
ఫ్యామిలీ ఎమోషన్స్

మైనస్ పాయింట్స్ :

కొత్త కథ తీసుకోకపోవడం

తీర్పు :

“నిదానమే ప్రదానము” అన్నట్టుగా తన తర్వాత చిత్రానికి గ్యాప్ ఎక్కువే ఇచ్చినా సరే ఆ గ్యాప్ ను బన్నీ మరియు త్రివిక్రమ్ లు సరిగ్గా పూడ్చేసారు.ఎక్కడ ఏం పెట్టాలో అలా త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ అలాగే డైలాగ్స్,ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు బన్నీ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ లు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవగా త్రివిక్రమ్ ఎంచుకున్న థీమ్ లైన్ ఇది వరకే ఉన్నదే తీసుకోవడం కాస్త నిరాశ కలిగించే అంశం అయితే ఇది కూడా పెద్ద మైనస్ కూడా అని చెప్పలేము.మొత్తంగా మాత్రం త్రివిక్రమ్ మరియు బన్నీల కెరీర్ లో ది బెస్ట్ చిత్రం ఇది అని చెప్పాలి.ఫ్యామిలీ ఆడియెన్స్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు కు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ చిత్రం తప్పకుండా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Rating: 4/5