మూవీ రివ్యూ : ఏబీసీడీ

మెగాకుటుంబం మరియు ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల్లో అత్యవసరంగా హిట్ కొట్టాల్సిన హీరోల్లో అల్లు శిరీష్ కూడా ఒకరు.తన కెరీర్ ఆరంభించిన తర్వాత కొన్ని వినూత్న సినిమాలు తీసే ప్రయత్నం చేసినా అవి అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఈసారి మలయాళంలో ఇప్పటికే విడుదలై మంచి విజయం అందుకున్న “ఏబీసీడీ” సినిమాను అదే పేరుతో రీమేక్ చేసిన ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలిసింది.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే అల్లు శిరీష్(అవి) అమెరికాలో ఎలాంటి బాధ్యతలు లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.దీనితో ఎన్నారై అయినటువంటి తన తండ్రి నాగబాబు శిరీష్ ను అసలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని అతన్ని మరియు అతని ఫ్రెండ్ (భరత్)బాషా ను బలవంతంగా ఇండియా పంపి అక్కడే ఎంబీఏ చెయ్యమని చెప్తాడు.అక్కడ చేరాక లోకల్ పొలిటిషన్ కొడుకుకు శిరీష్ కు మధ్య ఎదురైన సంఘటనలు ఏమిటి?వాటిని దాటుకొని శిరీష్ తాను ఉండే ఏరియాలో ఎలా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఈ నేపధ్యంలో హీరోయిన్ నేహా(రుక్షర్ దిలాన్) పాత్ర ఎలా తోడ్పడింది అన్నది తెలియాలంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

శ్రీరస్తు శుభమస్తు సినిమా తర్వాత మళ్ళీ శిరీష్ కు ఆ రేంజ్ బ్రేక్ రాలేదు.దానితో ఈసారి సేఫ్ గేమ్ ప్లాన్ చేసి అప్పటికే మలయాళంలో మంచి విజయం అందుకున్న “ఏబీసీడీ” సినిమాతో ముందుకొచ్చి మంచి ప్రయత్నమే చేసారని చెప్పాలి.ఎంటెర్టైమెంట్ మరియు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు సంజీవ్ రెడ్డి శిరీష్ తో చేసిన ప్రయత్నం పర్వాలేదని చెప్పాలి..ఎంటర్టైనింగ్ గా సాగే నరేషన్,ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది.

ఇక సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శిరీష్ మరియు తన ప్రత్యర్థి మధ్య వచ్చే సీన్లు అలాగే తాను అనుకోకుండా తాను ఉండే చోట ఫేమస్ గా మారే సీన్లు సినిమాపై మరింత ఆసక్తి కనబరుస్తాయి.ఇది సినిమాలో ప్రధాన హైలైట్ అని చెప్పొచ్చు.కాకపోతే అక్కడక్కడా మెల్లగా నడిచే కథనం కొన్ని చోట్ల సినిమాను ముందే ఊహించేయగలడం మైనస్ అని చెప్పాలి.ఈ విషయంలో దర్శకుడు సినిమాను ఇంకాస్త కొత్తగా మలచి ఉంటే బాగుండేది.దీని వల్ల సినిమా చూసిన ప్రేక్షకులకు ఏమాత్రం పెద్ద గొప్పగా అనిపించదు.

ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే శిరీష్ నుంచి ఎంత వరకు రాబట్టలో దర్శకుడు సంజీవ్ రెడ్డి అంతా రాబట్టేసారు.అలాగే మాస్టర్ భరత్ మరియు శిరీష్ ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాల్లో శిరీష్ టైమింగ్ బాగుంటుంది.అలాగే సహ నటునిగా నటించిన భరత్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు.ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర నాగబాబు బాధ్యతా రాహిత్యంగా ఉండే కొడుకు విషయంలో కేర్ తీసుకునే స్ట్రిక్ట్ తండ్రిగా ఆకట్టుకుంటారు.ఇక ఫైనల్ గా హీరోయిన్ రుక్షర్ దిలాన్ కూడా మంచి నటనను కనబర్చారు.అలాగే సంగీత దర్శకుడు జూధః శాండీ అందించిన పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్
శిరీష్ మరియు భరత్ ల నటన

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
వెన్నెల కిషోర్ పాత్రను సరిగ్గా వినియోగించుకోకపోవడం

తీర్పు :

ఇక మొత్తానికి “ఏబీసీడీ” అనే సినిమా అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ సమస్యలపై పోరాడే ఒక ఎన్నారై యువకునికి చెందిన సింపుల్ కథ.శిరీష్ మరియు భరత్ ల మధ్య కొన్ని కొన్ని కామెడీ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో హైలైట్ కాగా పేలవమైన కథనం మరియు గందరగోళానికి గురిచేసే మలుపులు సెకండాఫ్ మైనస్ పాయింట్లుగా నిలిచాయి.మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలవచ్చు.

Rating : 2.5/5

REVIEW OVERVIEW
ABCD Telugu Movie Review