సమీక్ష : బ్రోచేవారెవరురా

శ్రీవిష్ణు,ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నివేదా థామస్,నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా తెరకెక్కిన “బ్రోచేవారెవరురా” మూవీ నేడు విడుదలైంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ మూవీ ఓ కామెడీ క్రైమ్ థ్రిలర్ గా తెరకెక్కించారు. టైటిల్తోనే ఆసక్తిని కలిగించిన చిత్ర యూనిట్ వైవిధ్యమైన పోస్టర్స్,టీజర్,ట్రైలర్లతో ప్రేక్షకులకు చిత్రం పై అంచనాలు పెరిగేలా చేశారు. మరి ఆ అంచనాలకు అందుకుందో లేదు ఇప్పుడు విశ్లేషిద్దాం.

కథ:

బ్రోచేవారెవరురా విభిన్న కోణాలలో సాగే వైవిధ్యమైన స్టోరీ. సత్యదేవ్ ఓ పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనే ఓ యువకుడు, ఆ క్రమంలో తను ఎన్నో ఇబ్బందులు వడిదుడుకులు ఎదుర్కొంటాడు, చివరికి ఒక స్టార్ హీరోయిన్ షాలిని(నివేదా పేతురాజ్)కి తన కథ వినిపించే అవకాశం దక్కుతుంది. ఈ కథకు సమాంతరంగా మరో చోట ఆర్3 గ్యాంగ్ గా పిలవబడే రాహుల్(శ్రీవిష్ణు) రాకీ(ప్రియదర్శి) రాంబో(రాహుల్) ముగ్గరు స్నేహితులతో పాటు,వీరి క్లాసుమేట్ మిత్ర (నివేదా థామస్)ల కథ నడుస్తుంది. ఇంట్లో నుండి పారిపోయి స్వేచ్చగా బ్రతకాలనుకున్న మిత్ర కు ఆర్3 గ్యాంగ్ సహాయం చేస్తుంది. అసలు మిత్ర ఇంటిలోనుండి ఎందుకు పారిపోవాలనుకుంది, అందుకు ఈ ఆర్3 గ్యాంగ్ ఎలా సహకరించండి, అసలు డైరెక్టర్ సత్యదేవ్ కి వీరికి సంబంధం ఏమిటి? సత్యదేవ్ తన కల నెరవేర్చుకున్నాడా అనేది మిగతా కథ.
విశ్లేషణ:

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఎంచుకున్న కథ కొత్తగా అనిపించకపోయినా కూడా, చక్కని స్క్రీన్ ప్లే తో చిత్రాన్ని రక్తికట్టించారు. సస్పెన్సు సన్నివేశాలను కామెడీ తో మిక్స్ చేసి తెరకెక్కించడంలో విజయం సాధించారు. తన మొదటి సినిమా “మెంటల్ మదిలో” తో పోల్చుకుంటే ఆహ్లదంగా కథను చెప్పడంలో పరిణితి చెందాడనిపిస్తుంది.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపించిన శ్రీవిష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామ కృష్ణ తమ నటనతో సినిమా స్థాయిని పెంచారు. వారి వారి పాత్రల్లో చక్కగా కుదిరిన ముగ్గరు నటులు బెస్ట్ అవుట్ ఫుట్ అందించారు. తన సహజ నటనతో మరోసారి ఆకట్టుకున్నారు శ్రీవిష్ణు. ఇక ప్రియదర్శి,రాహుల్ పై తెరకెక్కిన హాస్యసన్నివేశాలు థియేటర్లో చక్కగా పేలాయి.

సినిమా మొత్తం దాదాపు అన్ని సన్నివేశాల్లో కనిపించే కీలక పాత్ర చేసిన నివేదా థామస్ తనం మార్క్ నటనతో అలరించారు. టీనేజ్ అమ్మాయిగా చక్కగా సరిపోయింది. సత్యదేవ్ , మరో హీరోయిన్ నివేదా పేతురాజ్ తమ పాత్రల పరిధిలో పర్వాలేదనిపించారు. ఇక లాస్టులో కమెడియన్ బిత్తిరి సత్తి ఎంట్రీ మంచి రిలీఫ్ ఇస్తుంది.

ప్లస్ పాయింట్స్:

మొదటి భాగంలోని కామెడీ సన్నివేశాలు
శ్రీవిష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ నటన
నివేదా థామస్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

నెమ్మదిగా సాగే సెకండ్ హాఫ్
బలహీనమైన కథ

తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే “బ్రోచేవారెవరురా మూవీ వివిధ కోణాలలో ఆసక్తికరంగా సాగే కామెడీ థ్రిల్లర్. కడుపుబ్బా నవ్వించే హాస్యసన్నివేశాలు, ఆసక్తిగొలిపే మలుపులతో మొదటి సగం ఆహ్లాదంగా సాగే చిత్రం రెండవ భాగంలో మాత్రం నెరేషన్ కొంచెం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. క్రైమ్ కామెడీ జోనర్ సినిమాలను అమితంగా ఇష్టపడే వారికి ఈ మూవీ మంచి అనుభూతి ఇస్తుంది అనడంలో సందేహం లేదు .

Rating : 3/5