మూవీ రివ్యూ : “చాణక్య”

యాక్షన్ హీరో గోపి చంద్ కథానాయకునిగా మెహ్రీన్ హీరోయిన్ గా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “చాణక్య”. గత కొన్నాళ్ల నుంచి కూడా వైవిధ్యమైన సబ్జెక్టులను ఎన్నుకుంటున్న గోపి చంద్ మరోసారి మరో ఆసక్తికర సబ్జెక్టును ఎన్నుకొని వస్తున్నారని ఈ చిత్ర టీజర్ తోనే తెలిపారు.యాక్షన్ మరియు స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమ ఈ రోజే విడుదల అయ్యింది.మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే అర్జున్(గోపిచంద్) భారతదేశానికి చెందిన రీసెర్చ్ అండ్ వింగ్ ఉడెర్ కవర్ ఏజెంట్.అయితే ఒక మిషన్ నిమిత్తం బ్యాంకు ఉద్యోగిగా మారాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు చెందిన క్రూరమైన టెర్రరిస్ట్ ఖురేషికి సంబంధించిన కొంతమంది స్లీపర్ సెల్స్ ను చంపి అతన్ని టార్గెట్ చేస్తాడు.ఇలా అర్జున్ ఖురేషీని ఎలా ఎదుర్కొన్నాడు?ఈ నేపథ్యంలో అతను చేపట్టిన మిషన్ ఏమిటి?ఇదంతా ఎలా కొనసాగింది అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

తన మొదటి సినిమా నుంచి కూడా ఇప్పటి వరకు హీరో గోపీచంద్ ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో కనిపించారు.కాలం మారుతున్న కొద్దీ గోపీచంద్ కూడా రొటీన్ చిత్రాలకు భిన్నం మంచి సబ్జెక్టులను ఎన్నుకోవడం “సాహసం” సినిమా నుంచి మొదలు పెట్టారు.దీనితో అప్పటి నుంచి మళ్ళీ గోపీచంద్ సినిమాలపై మంచి అభిప్రాయాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు ఏర్పరుచుకున్నారు.దీనితో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అందుకు తగ్గట్టుగానే గోపీచంద్ ఈ సినిమాలో కూడా పూర్తి న్యాయం చేకూర్చారు.

అయితే ఒక అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించిన గోపీచంద్ తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చారు.అయితే గోపీచంద్ పెర్ఫామెన్స్ పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ మాత్రం గోపీచంద్ సినిమాల నుంచి ఏం కోరుకుంటారో వారికి సంతృప్తి కలిగించదు.రొటీన్ కామెడీ, పెద్దగా ఆసక్తికరంగా సాగని స్పై థ్రిల్లర్ గా ఇది వరకే ఎన్నో సినిమాల్లో చూసేసిన కథనంలా రొటీన్ గా అనిపిస్తుంది.అందువల్ల ఫస్ట్ హాఫ్ మాత్రం సోసో గానే అనిపిస్తుంది.

కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం గోపీచంద్ పాకిస్థాన్ లో అడుగుపెట్టినప్పటి నుంచి సినిమా కాస్త ఆసక్తికరంగా మారుతుంది.కథానుసారం వచ్చే ట్విస్టులు కథనం ఆసక్తికరంగా మారడం వంటివి ప్లస్సవుతాయి.అలాగే గోపీచంద్ మరియు మెహ్రీన్ ల మధ్య కెమిస్ట్రీ బాగుంది.అలాగే ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ చేసిన ఐటెం సాంగ్ సహా సహాయక పాత్రలో మంచి నటన కనబరిచింది.ఇక దర్శకుని విషయానికి వచ్చినట్టయితే కథను రాసుకున్న తిరు తాను సెకండాఫ్ తెరకెక్కించినట్టుగా ఫస్ట్ హాఫ్ ను కూడా మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే ఈ సినిమాకు మరింత మంచి ఫలితం వచ్చి ఉండేది.

టీజర్ మరియు ట్రైలర్లతో ఒక స్పై థ్రిల్లర్ ఎఫెక్ట్ ను తీసుకొచ్చిన దర్శకుడు దాన్ని పూర్తిస్థాయిగా రక్తి కట్టించడంలో కాస్త తడబడ్డారు.తమిళంలో మంచి సినిమాలు తీసిన దర్శకునిగా తిరుకి మంచి పేరు ఉంది.కానీ మన దగ్గర మాత్రం తన మొదటి ప్రయత్నమే అనుకున్న స్థాయిలో జరగలేదు అని చెప్పొచ్చు.వెట్రి పళనిస్వామి అందించిన సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది.అలాగే విశాల్ అందించిన నాలుగు పాటలు పర్వాలేదనిపిస్తాయి.అలాగే శ్రీచరణ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనానికి తగ్గట్టుగా ఇంప్రెస్ చేస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

గోపీచంద్ పెర్ఫామెన్స్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

సంగీతం
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం
బోరింగ్ స్క్రీన్ ప్లే

తీర్పు :

గోపీచంద్ నుంచి ఈమధ్య కాలంలో మంచి సినిమాలు వస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా దర్శకుడు తెరకెక్కించిన తీరు సరిగా లేకపోవడం వలన తడబడింది.ఆసక్తికరంగా సాగని ఫస్ట్ హాఫ్ బోరింగ్ స్క్రీన్ ప్లే మరియు రొటీన్ కథ వంటివి దెబ్బ తీశాయి.ఓవరాల్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచిపోవచ్చు.

Rating: 2.5/5