మూవీ రివ్యూ : చిత్రలహరి

వరుసగా ఆరు ప్లాపుల తరువాత సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చిత్రలహరి తో ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసినఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మరి ఈ చిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

విజయ్ ( సాయి తేజ్) కెరీర్ లో సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఈక్రమంలో విజయ్ కి లహరి (కళ్యాణి ప్రియదర్శన్) తో పరిచయం ఏర్పడి ఆమె తో ప్రేమలో పడతాడు. అయితే తరువాత ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోతారు. ఇక లైఫ్ లో విజయం సాధించడం కోసం స్వేచ్ఛ (నివేత) సహాయం తీసుకుంటాడు విజయ్. ఇంతకీ విజయ్ సక్సెస్ అయ్యాడా ? మళ్ళీ విజయ్ , లహరి కలిశారా అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి క్లీన్ ఎంటెర్టైనర్లను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని కూడా ఎక్కడా అసభ్యత లేకుండా చాలా నీట్ గా తెరకెక్కించాడు. ముఖ్యంగా సినిమా కు యూత్ ను కనెక్ట్ అయ్యే లా చేయడం లో విజయం సాధించాడు. ఈ చిత్రంతో ఒక మంచి సందేశం ఇవ్వడం లో దర్శకుడు ఫాస్ అయ్యాడు కానీ ఫిలిం మేకర్ గా మాత్రం పూర్తి గా సక్సెస్ కాలేకపోయాయడు.

ఇక సినిమాలో విజయ్ పాత్ర ను డీల్ చేసిన విధానం బాగుంది. విజయ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ , ఆలాగే తేజు , పోసాని నటన దేవి శ్రీ ప్రసాద్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో మేజర్ హైలైట్స్ కాగా అయితే లవ్ ట్రాక్ , స్లో నరేషన్ సినిమాకు డ్రా బ్యాక్ అయ్యాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్ పాత్ర కు సాయి తేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఆ పాత్రలో తేజు నటన సినిమాకు హైలైట్ అయ్యింది. గత సినిమాలతో పోలిస్తే నటన పరంగా తేజు ఈ సినిమాలో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇక ఈ పాత్ర తరువాత బాగా కనెక్ట్ అయ్యే పాత్ర పోసాని కృష్ణ మురళ పాత్ర. తేజు తండ్రి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఈరెండు పాత్రతో పాటు హీరోయిన్స్ కూడా ఆకట్టుకుంటారు. సునీల్ , వెన్నల కిషోర్ అక్కడక్కడ నవ్వించగలిగారు.

ప్లస్ పాయింట్స్ :

సాయి తేజ్

పోసాని

కళ్యాణి , నివేత

మైనస్ పాయింట్స్ :

సాయి తేజ్ పిజిక్

స్లో నరేషన్

సాంగ్స్

తీర్పు :

రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కిన ఈ చిత్రలహరి లో తేజు , పోసానిల నటన , సంగీతం , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్స్ అవ్వగా సాలిడ్ స్టోరీ లేకవడం ,స్లో నరేషన్ మైనస్ గా చెప్పొచ్చు. చివరగా ఈ చిత్రం యూత్ కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. మరి మిగితా వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Rating : 3/5