మూవీ రివ్యూ : “డియర్ కామ్రేడ్”

టాలీవుడ్ సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రైజింగ్ హీరోయిన్ రష్మికా మందన్నాల కాంబినేషన్లో రెండవ చిత్రంగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్”. హీరోగా నిలదొక్కుకున్న తర్వాత అతి తక్కువ కాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ ఈసారి ఏకంగా నాలుగు భాషల్లో తన విడుదలకు రంగం సిద్ధం సిద్ధం చేసారు.అందుకు తగ్గట్టుగానే విపరీతమైన ప్రమోషన్స్ ద్వారా చిత్రంపై మంచి హైప్ ను కూడా వీరు తీసుకొచ్చారు.మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఎంత వరకు అందుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే బాబీ(విజయ్ దేవరకొండ) నిజాయితీకల నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్.అలాంటి తాను స్టేట్ క్రికెట్ ప్లేయర్ అయినటువంటి లిల్లి(రష్మిక)ను అనేక ప్రయత్నాల తర్వాత తన ప్రేమలో పడేస్తాడు.కానీ అతనికున్న ఆవేశం వల్ల ఈ ఇద్దరి మధ్య సమస్యలు లేవనెత్తి మధ్యన దూరం ఏర్పడుతుంది.ఈ సమస్యలన్నిటినీ బాబీ ఎలా పరిష్కారించుకున్నాడు ?ఇతని ఆవేశ స్వభావం లిల్లీ భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపించింది అన్నవి తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

విజయ్ నుంచి సినిమా ఒక సినిమా వచ్చి చాలా కాలం కావడంతో విజయ్ అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అదే విధంగా ఏకకాలంలో నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చేసిన ప్రకటనలు అలాగే ప్రమోషన్స్ వల్ల అన్ని వర్గాల ప్రేక్షలుకులను కూడా ఈ సినిమా వైపు తిప్పుకున్నారు,కానీ ఈ ప్రయత్నం మొదట్లోనే తడబడ్డట్టుగా సినిమా చూస్తే అర్ధం అవుతుంది,ఫస్ట్ హాఫ్ లో విజయ్ మరియు రష్మికాల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకున్నా ఎక్కడో సినిమా నెమ్మదిగా సాగుతున్న భావన ఖచ్చితంగా కలుగుతుంది.

ఈ విషయంలో దర్శకుడు జాగ్రత్త తీసుకోవాల్సింది.దీనితో మొదటి సగం ముగిసే సరికి సినిమా పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉంది అనిపిస్తుంది.కాలేజ్ ఎపిసోడ్స్ తప్ప ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గ సన్నివేశాలు కూడా ఉండవు.ఇక సెకండాఫ్ విషయానికి వచ్చినట్టైతే కథలో ఏమన్నా కొత్తగా అంశాలు కనిపిస్తాయా అని ఎదురు చూసే ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుందని చెప్పాలి.సినిమా నిడివి పెద్దది కావడం మూలాన సెకండాఫ్ కూడా కాస్త స్లో గానే సాగినట్టు అనిపిస్తుంది.అల్లాగే కొన్ని కొన్ని సన్నివేశాలు ముందుగానే ఊహించెయగలగడం వంటివి కూడా కాస్త నిరాశ పరుస్తాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఒక కాలేజ్ స్టూడెంట్ గా కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తిగా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని యువకునిగా విజయ్ అదరగొడతారు.అలాగే రష్మిక క్రికెట్ ప్లేయర్ గా మరియు కథకు తగ్గట్టుగా తన పాత్రలో ఇమిడిపోతుంది ఇక ఈ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ మరోసారి చక్కగా ఆట్టుకుంటుంది.విజయ్ లో అగ్రెసివ్ మోడ్ అక్కడక్కడా కనిపించడం అభిమానులకు కాస్త బూస్టప్ ఇస్తుంది.దర్శకుడు భరత్ ఎంచుకున్న కథలోని స్టైల్ అర్జున్ రెడ్డిలో కూడా చూసేసిన అనుభూతి కనిపిస్తుంది దానికి కాస్త కమ్యూనిస్ట్ భావజాలాలు జోడించి ఈ కథను రెడీ చేసినట్టు అనిపిస్తుంది తప్ప కొత్తదనం ఏమి కనిపించదు. జస్టిన్ ప్రభాకర్ అందించిన సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు సినిమాకు మరింత జీవం పోస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ మరియు రష్మిక
క్లైమాక్స్ లోని సందేశం
పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

సినిమా నిడివి
ఫస్ట్,సెకండాఫ్ లలో సాగదీత
కథలో కొత్తదనం లేకపోవడం

తీర్పు :

ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే దర్శకుడు భరత్ కమ్మ “నిజాయితీ గల సందేశం” మొదటి ప్రయత్నం నెమ్మదిగా పెద్దగా కొత్తదనం లేమితోనే మొదలయిందని చెప్పాలి.విజయ్ మరియు రష్మికాల మధ్య కెమిస్ట్రీ మరియు ఎమోషనల్ ఎపిసోడ్స్ ప్లస్ పాయింట్స్ గా నిలవగా కొత్తదనం లేని కథ కథనాలు నెమ్మదిగా నడిచే స్క్రీన్ ప్లే మైనస్ లుగా నిలిచాయి.మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Rating: 3/5