మూవీ రివ్యూ : ‘ఫలక్ నుమా దాస్’

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా మారి ‘ఫలక్ నుమా దాస్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ఈ రోజు ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేయడం జరిగింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

ఫలక్ నుమా ఏరియాలో పుట్టి పెరిగిన దాస్ (విశ్వక్‌ సేన్‌) అదే ఏరియాలోని శంకరన్న అనే వ్యక్తిని చూసి.. ప్రేరణ పొంది చిన్నప్పడే అతనిలా ఓ గ్యాంగ్ ని పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అలా ఒక గ్యాంగ్ తయారుచేసుకుని చిన్న చిన్న గొడవలతో అలాగే టినాతో ఆ తరువాత సఖితో ప్రేమలో మునిగి తెలుతుండగా.. సడెన్ గా శంకరన్నని చంపేస్తారు. దాంతో దాస్ ఆ చంపిన వాళ్లను పట్టుకుని పొలీస్ లకు పట్టిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అంతరం దాస్ ఓ హత్య కేసులో ఇరుకుంటాడు. ఈ క్రమంలో దాస్ ఆ కేసు నుండి బయట పడటానికి ఏమి ఏం పనులు చేసాడు ? ఈ క్రమంలో తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? ఇంతకీ దాస్ ఆ కేసు నుండి బయటపడ్డాడా ? లేదా ? చివరికి దాస్ గ్యాంగ్ సెటిల్ అయ్యారు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

 

విశ్లేషణ:

‘ఫలక్ నుమా దాస్’ రీమేక్ మూవీ అయినప్పటికీ, అసలు ఎక్కడా రీమేక్ మూవీ అనే భావనే కలగకుండా.. మన నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలో చేసిన మార్పులు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నేపధ్యాన్ని హైదరాబాద్ పాతబస్తీ పరిసరాలకు మార్చడం సినిమా బిగ్ ప్లస్ పాయింట్ అయింది.

ఇక ఫలక్ నుమా దాస్ చిత్రంలోని డైలాగ్స్, టేకింగ్, నటీనటుల నటన ప్రధానంగా తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ నటన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే ప్రేమ మరియు ఫ్రెండ్షిప్ తాలూకు ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్‌ సేన్‌ ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించాడు. తన నటనతో పాటు డైలాగ్ మాడ్యులేషన్ తో కూడా విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకుంటాడు. ఇక హీరోయిన్స్ గా నటించిన హర్షిత గౌర్ అండ్ సలోని తమ గ్లామర్ తోనే కాకుండా.. తమ నటన పరంగా కూడా బాగా చేసారు. ఇక ఈ సినిమాలో ఫ్రెండిష్, ప్రేమ, డబ్బు కన్నింగ్ వంటి సున్నితమైన అంశాలను వాటి వల్ల పడే ఇబ్బందలను చాలా వాస్తవికంగా చూపించటం ఆకట్టుకుంటుంది. పైగా సినిమా చివరకి వచ్చేసరికి పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయిటైన్ చేశాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా మీద మంచి భావేద్వేగంతో కూడుకున్న అనుభూతి కలుగుతుంది.

అయితే విశ్వక్‌ సేన్‌ కథ, పాత్రల పరంగా మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. పాత్రలు పరిచయానికి చాలా సమయం తీసుకున్నారనుకున్నారు. పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఈ చిత్రం ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. కాగా సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన నేపధ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాత కరాటీ రాజు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

 

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్
సినిమా నేపథ్యం
నటీనటుల నటన
పాత్రలు మరియు డైలాగ్స్
బి.సి ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండటం.

 

మైనస్ పాయింట్స్ :

కథనం,
సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం,
రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం,
క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం.

 

తీర్పు :

ఫలక్ నుమా దాస్ చిత్రంలోని డైలాగ్స్, టేకింగ్, నటీనటుల నటన.. ప్రధానంగా విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ నటన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే ప్రేమ మరియు ఫ్రెండ్షిప్ తాలూకు ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశారు. అయితే సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. మొత్తానికి మాస్ ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉండటం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా నిలవచ్చు.

 

Rating : 3/5

REVIEW OVERVIEW
Falaknuma Das Movie Review in Telugu