మూవీ రివ్యూ : “గద్దలకొండ గణేష్”

తన మొదటి సినిమా నుంచి కూడా వినూత్న సబ్జెక్టులను ఎన్నుకుంటూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా కాంపౌండ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు.అలా ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “వాల్మీకి” టైటిల్ ను చివరి నిమిషంలో “గద్దలకొండ గణేష్” గా మార్చవలసి వచ్చింది.తమిళ్ లో “జిగర్తాండ”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ లుక్ తోనే ఒక స్పెషల్ క్రేజ్ ను తీసుకొచ్చారు.దీనితో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్) ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్.ఇదే క్రమంలో అభిలాష్(అథర్వ) దర్శకునిగా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక రోజున తాను పని చేసే దర్శకుని దగ్గర ఒక్క సంవత్సరంలో దర్శకునిగా మారి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తాడు.అలా ఒక నిజమైన గ్యాంగ్స్టర్ కథను తియ్యాలని భావించి గద్దలకొండ గణేష్ ను ఫాలో అవుతాడు.అలా అయ్యిన అథర్వ గణేష్ తో సినిమా చేసాడా?అసలు ఈ గద్దలకొండ గణేష్ అనే వ్యక్తి ఎవరు?అతను ఎందుకు అలా మారాడు?అసలు వీరిద్దరూ సినిమా చేసారా లేదా?ఈ కథకు పూజా హెగ్డే పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

తన మొదటి సినిమా నుంచి కూడా హీరో వరుణ్ తేజ్ ఒక కొత్తరకమైన కథను తెలుగు ప్రేక్షకులకు అందిద్దామనే వినూత్న సబ్జెక్టులు ఎన్నుకుంటూ తన మేకోవర్ ను మారుస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.అలాగే ఈ సినిమాతో పక్కా మాస్ లుక్ లోకి మారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అయితే సినిమాలో కూడా అదే రీతిలో కనిపించి హైలైట్ గా నిలిచినా సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం అంత ఊహించిన విధంగా సాగలేదు.

ఖచ్చితంగా వరుణ్ మరియు హరీష్ శంకర్ ల కాంబినేషన్ పై చాలా మంది మంచి అంచనాలను పెట్టుకొని ఉంటారు.అవి నీరసించిపోడానికి ఎంతో సమయం పట్టదు.పెద్దగా ఆసక్తికరంగా సాగని కథనం అంతగా ఇంప్రెస్ చెయ్యని మిక్కీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ హాఫ్ కు అంతగా కలిసిరావు.పూజా పాత్ర కూడా ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే వరకు రివీల్ కాదు,అయితే గద్దలకొండ గణేష్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో వరుణ్ మాస్ లుక్ కటౌట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది.వరుణ్ చెప్పే డైలాగ్స్ కానీ ఆ అగ్రెసివ్,వేరియేషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి.

ఇక సెకండాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది.ఇక్కడ నుంచి కథ కొంచెం మారినట్టుగా స్లోగా పర్వాలేదనిపిస్తుంది.పూజా మరియు వరుణ్ ల మధ్య సన్నివేశాలు తక్కువే ఉన్నా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చక్కగా కుదిరింది.అలనాటి గోల్డెన్ హిట్ సాంగ్ “ఎల్లువొచ్చి గోదారమ్మ”పాట కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.అక్కడక్కడా వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి.

అయినా సినిమా పెద్దది కావడంతో ఆ ఫీల్ మాత్రం ఇట్టే తెలిసిపోతుంది.ఈ విషయంలో హరీష్ ఇంకా మార్పులు చేర్పులు చేసి ఇంకా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించి ఉంటే బాగుండేది.ఆయనంక బోస్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.అయితే సినిమా నిడివి పెద్దది కావడం అక్కడక్కడా చోటా కే ప్రసాద్ తో దర్శకుడు కాస్త ఎడిటింగ్ చేయించి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

కొత్త అవతార్ లో వరుణ్ పెర్ఫామెన్స్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

అనవసరమైన అరుపులు,కేకలు
బ్యాక్గ్రౌండ్ స్కోర్
అథర్వ పాత్ర
అంతగా ఆకట్టుకోని ఎమోషన్స్

తీర్పు :

మొత్తానికి “గద్దలకొండ గణేష్” సినిమా అక్కడక్కడా మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా చెప్పొచ్చు.వరుణ్ తేజ్ నటన మరియు అతన్ని ఎలివేట్ చేసే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఎమోషన్స్ లో లోపం సినిమా కథనం కూడా సరిగ్గా లేకపోవడం నిరాశపరుస్తాయి.ఓవరాల్ గా ఈ చిత్రం బిలో యావరేజ్ గా నిలిచిపోవచ్చు.

Rating: 2.5/5