మూవీ రివ్యూ : “గ్యాంగ్ లీడర్”

నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా మొట్టమొదటి సారిగా హీరో కార్తికేయ నెగిటివ్ షేడ్ లో నటించిన చిత్రం “గ్యాంగ్ లీడర్”. “జెర్సీ” లాంటి ఎమోషనల్ హిట్ సొంతం చేసుకున్నాక అందులోను ఇష్క్,మనం,24 లాంటి ఎన్నో వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఎంత వరకు అందుకుందా లేదా అన్నది ఇప్పుడు సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే పెన్సిల్(నాని) ఒక స్టోరీ రైటర్ గా మారాలి అనుకుంటాడు.ఇదే క్రమంలో ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతుంది.ఈ దొంగతనాన్ని ఛేదించేందుకు మొత్తం ఐదుగురు ఆడవాళ్లు తమ గ్యాంగ్ కు లీడర్ గా ఉండాలని కోరుతారు.దీనితో నాని వారి గ్యాంగ్ కు ఎలా “గ్యాంగ్ లీడర్” అయ్యాడు.ఈ గ్యాంగ్ అంతా కలిసి అసలు ఆ దొంగతనం ఎందుకు జరిగింది దాని వెనుకున్న రహస్యాన్ని చేధించారా? ఈ కథ అంతటికి మరో ప్రధాన పాత్రదారుడు కార్తికేయ(దేవ్)కు ఉన్న సంబంధం ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ చిత్రం మొదలైన చాలా సేపటి వరకు కాస్త కథనం నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది.అలా అలా నెమ్మదిగా కథలోని ఒక్కొక్క పాత్ర చేరుతుండడంతో సినిమాపై మెల్లగా ఆసక్తి ఎక్కువవుతుంది.ఇలా ఫస్టాఫ్ లోని ఆ కొంచెం లాగ్ ను పక్కన పెడితే మొత్తం ఆ ఐదుగురు ఆడవాళ్ళ గ్యాంగ్ మరియు నానీల మధ్య వచ్చే కామెడి ఎపిసోడ్లు మరియు వెన్నెల కిషోర్ తో కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటాయి.అంతేకాకుండా నానితో కలిసి వారు చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ సినిమా చూసే ప్రేక్షకుడికి తర్వాత ఏం జరుగుతుంది అని మరింత థ్రిల్ ఇస్తాయి.

అలాగే ఈ సినిమాలోని మరో ప్రధాన పాత్ర అయినటువంటి కార్తికేయ క్యారెక్టర్ కథనంలోకి ఎంటర్ అయ్యిన తర్వాత నుంచి సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది.అందుకు తగ్గట్టుగానే సెకండాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ మారుతూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటాయి.ఇలా సినిమా కాస్త నెమ్మదిగా మొదలయినా పూర్తయ్యే వరకు మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది.ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే నాచురల్ స్టార్ నాని ఎప్పటిలానే తన పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

అంతే కాకుండా మరో ప్రధాన పాత్రలో కనిపించిన కార్తికేయ కూడా అద్భుతమైన నటన కనబర్చారు.అలాగే నాని మరియు హీరోయిన్ ప్రియంకాల మధ్య సీన్స్ లో ప్రియాంక మంచి నటన కనబర్చారు.అలాగే నాని గ్యాంగ్ లో కనిపించిన మిగతా సీనియర్ నటులు తమదైన నటనతో ఆకట్టుకుంటారు.ఇక దర్శకుని విషయానికి వచ్చినట్టయితే ఇప్పటి వరకు విక్రమ్ కే కుమార్ చిత్రాలు సినిమాలు చూసిన వారు అయితే ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకొని ఉంటారు.

చాలా మందికి టీజర్ మరియు ట్రైలర్లు చూడ్డానికి అంతగా అనిపించలేదు అని చెప్పినా వారి అంచనాలను తప్పు చేసే విధంగా విక్రమ్ కె కుమార్ మరోసారి తన మార్క్ ను ఈ చిత్రంలో కూడా చూపించారు.తాను రాసుకున్న కథ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఒక కొత్త కథను చూసిన ఫీలింగ్ ను సినిమా చూసే ప్రేక్షకుడికి ఇస్తుంది.అలాగే నాని మరియు కార్తికేయల పాత్రలను ఎక్కడా కూడా తగ్గించకుండా విక్రమ్ తెరకెక్కించిన తీరు చాలా బాగుంది.

అయితే ఫస్టాఫ్ లో కాస్త సినిమా నెమ్మదించింది.ఆ సందర్భంలో కథనంను మరింత ఆసక్తికరంగా మలిస్తే బాగున్ను.కానీ మిగతా సెకండాఫ్ మాత్రం వేరే స్థాయిలో తెరకెక్కించారు.ముఖ్యంగా క్లైమాక్స్ కు దగ్గరవుతున్న కొద్దీ కుర్చీ అంచున కూర్చునేలా కథనం మారిపోతుంది.కానీ మళ్ళీ అక్కడే సినిమాను కాస్త డౌన్ చేస్తారు.అలాగే అనిరుద్ ఇచ్చిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

నాని మరియు కార్తికేయల పెర్ఫామెన్స్లు
కథ,కథనం
కథానుసారం వచ్చే ట్విస్టులు
అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ నెమ్మదించిన కథనం
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సీన్స్ తగ్గించడం

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే విక్రమ్ కె కుమార్ మరోసారి ఒక వినూత్న కథ మరియు కథనాలతో ఆకట్టుకున్నారని చెప్పొచ్చు.గ్యాంగ్ లీడర్ గా నాని మరియు కార్తికేయల పెర్ఫామెన్స్ లు అలాగే ఆసక్తికరంగా సాగే కథనం,ట్విస్టులు ప్రధాన ఆకర్షణగా నిలవగా అక్కడక్కడా సాగదీత,ప్రీ క్లైమాక్స్ లోని చిన్నగా సినిమా డౌన్ అవ్వడం వంటివి కాస్త నిరాశపరుస్తాయి.ఓవరాల్ గా మాత్రం “గ్యాంగ్ లీడర్”గా నాని ఈ వారాంతానికి బాగానే ఆకట్టుకుంటాడు.

Rating: 3.5/5