మూవీ రివ్యూ : ‘జార్జిరెడ్డి’

విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు జార్జిరెడ్డి. ఎందరో విద్యార్తులను కదిలించిన వ్యక్తి, అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెర పై ఆవిష్కృతం అయిన సంగతి తెలిసిందే. గతంలో ‘దళం’ సినిమాతో విబిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం టాలీవుడ్ జనాన్ని ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

జార్జిరెడ్డి (సందీప్ మాధవ్) చిన్నతనం నుండి ఆవేశంతో అన్యాయం పై ఎదురుతిరుగుతుంటాడు. అలాంటి వ్యక్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విప్లవాత్మక విద్యార్థి నాయకుడుగా ఎదుగుతాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి ఒక మాములు స్టూడెంట్ గా వచ్చిన జార్జ్ నాయకుడుగా ఎలా మారాడు? క్యాంపస్‌లోని వివిధ సమస్యలకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవి జార్జ్ కి ఎలాంటి సమస్యలను తీసుకొచ్చాయి? ప్రత్యర్థి ముఠాలు జార్జిని చంపటానికి చేసిన ప్లాన్ ఏంటి? వాళ్ళు జార్జ్ ని ఎలా చంపారు? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ:

దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా ఎదిగి.. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన జార్జిరెడ్డి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి దర్శకుడు జీవన్ రెడ్డి తీసుకున్న జాగ్రత్తలు… ముఖ్యంగా అప్పటి నేపథ్యం దగ్గరనుంచీ.. ఆయా పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపించిన విధానం వరకూ.. ఇలా ప్రతిది జీవన్ రెడ్డి చాల చక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం తాలూకు సన్నివేశాలు, అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాల బాగున్నాయి. జార్జిరెడ్డిని ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేసే సన్నివేశం.. జార్జ్ కి మంచి జాబ్ అవకాశం వచ్చినా తన నమ్మిన సిద్దాంతం కోసం ఆ అవకాశాన్ని కూడా వదులుకునే సీన్, అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి. జార్జిరెడ్డి పాత్రలో కనిపించిన సందీప్ మాధవ్.. ఆ పాత్రలోని ఆవేశాన్ని విప్లవాన్ని మరియు ఆలోచనను తన హావభావాలతో చక్కగా పలికించాడు. కీలక పాత్రలో కనిపించిన సత్య దేవ్, ‘జార్జి రెడ్డి’ తల్లి పాత్రలో నటించిన ప్రముఖ మరాఠీ నటి దేవిక తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే ఉద్యమం మరియు ఫ్రెండ్షిప్ తాలూకు ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశారు.

అయితే.. సినిమాలోని ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. అవసరానికి మించి బిల్డప్ సీన్స్ ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా ఉండదు. పైగా ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతుంది. ఇక యాక్షన్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు ఆ సీన్స్. పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. దీనికి తోడు ప్లే ఆసక్తికరంగా సాగకపోగా స్లోగా సాగుతుంది. మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయారు. సంగీత దర్శకుడు అందించిన నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాతలు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్ :

జార్జిరెడ్డి పాత్ర
ఎమోషనల్ సీన్స్
ఫస్ట్ హాఫ్ లోని కాలేజీ సీన్స్
సినిమా నేపథ్యం
నటీనటుల నటన
పాత్రలు మరియు డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

కథనం
బోరింగ్ ట్రీట్మెంట్
సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం
వీక్ క్లైమాక్స్

తీర్పు :

విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా జార్జిరెడ్డి ఎందరో విద్యార్తులకు ఆదర్శనీయమైన విద్యార్థి నేతగా నిలిచినట్లే.. ఈ సినిమా కూడా జార్జిరెడ్డి జీవితాన్ని వెండితెర పై శాశ్వతంగా ఆవిష్కృతం చేసింది. సినిమాలోని డైలాగ్స్, టేకింగ్, నటీనటుల నటన.. ప్రధానంగా సందీప్ మాధవ్ నటన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే ఉద్యమం, అన్యాయం పై పోరాటం మరియు ఫ్రెండ్షిప్ తాలూకు ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశారు. అయితే సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, క్లారిటీ మిస్ అవ్వడం కొన్ని చోట్ల పేలవమైన కథనం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. ఏమైనా ఈ తరం జార్జ్ లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి తెలుసుకోవాలి. ఈ ఫర్ గాటెన్ లీడర్ కోసం ఈ సినిమా చూడొచ్చు.

Rating: 3/5

REVIEW OVERVIEW
George Reddy Movie Review in Telugu