మూవీ రివ్యూ : “ఇద్దరిలోకం ఒకటే”

తన కెరీర్ ఆరంభంలోనే వరుస హిట్ చిత్రాలను అందుకున్నాడు రాజ్ తరుణ్ కానీ తన గ్రాఫ్ ను ఎలా అయితే పెంచుకున్నాడో అంతే త్వరగా అది తర్వాత పడిపోయింది.దానితో ఇంకో సినిమా చెయ్యడానికి చాలా సమయాన్నేతీసుకున్నాడు.అలా ఇప్పుడు అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే హీరోయిన్ గా జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో క్రిస్మస్ పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి ఈ చిత్రంతో అయినా సరే రాజ్ తరుణ్ మంచి హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే హీరో రాజ్ తరుణ్ మరియు హీరోయిన్ షాలిని పాండే పాత్రలు చిన్ననాడే విడిపోయి మళ్ళీ పాతికేళ్ల తర్వాత ఊహించని పరిణామాల తర్వాత కలుసుకుంటారు.అలా విడిపోయిన ఈ ఇద్దరూ ప్రేమలో పడతారు.కానీ అనూహ్యంగా మళ్ళీ విడిపోతారు.ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన వీరు మళ్ళీ విడిపోడానికి కారణం ఏమిటి?ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ తన గురించి తెలుసుకున్న ఓ కీలక నిజం ఏమిటి?దాని వలన రాజ్ తరుణ్ కు ఏమవుతుంది?ఇంతకీ వీరిద్దరి ప్రేమ ఎలా సక్సెస్ అయ్యింది అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

మొదటగా లవ్ స్టోరీలు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.ప్రేమ ఒకటే అయినా సరే దానిని సరిగ్గా తెరకెక్కిస్తే ఎవరైనా సరే బాగా కనెక్ట్ అవుతారు.అలాంటి ప్రేమికుల రోల్స్ లో రాజ్ తరుణ్ మరియు షాలిని పాండేలు అద్భుతమైన నటన కనబర్చారు.సాంగ్స్ లో కానీ కెమిస్ట్రీ ఎపిసోడ్స్ లో కానీ ఈ ఇద్దరి ఫైర్ చిత్రంలో చాలా బాగుంది.కాకపోతే ఫస్ట్ హాఫ్ లోని కథ కాస్త నెమ్మదిగా సాగడం మూలానా సినిమా చూసే ప్రేక్షకుడికి మొదటి నుంచే అంతలా ఆసక్తి కలకగకపోవచ్చు.అలా అలా నెమ్మదిగా పర్వాలేదనిపిస్తుంది.

పై పెచ్చు అసలు స్టోరీ ఏమిటి అన్నది తెలుసుకోడానికి కూడా కాస్త సమయం ఎక్కువే తీసుకున్నట్టు అనిపిస్తుంది.వీటి మూలాన చిత్రంపై పెద్దగా ఆసక్తి పెరగకపోచ్చు.కానీ ఆ తర్వాత నుంచి మెల్లగా స్క్రీన్ ప్లై డీసెంట్ గా కొనసాగుతుంది.కథానుసారం వచ్చే సాంగ్స్ మరియు లొకేషన్స్ ముఖ్యంగా ఊటీ లొకేషన్స్ లో సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.ఇక దర్శకుని విషయానికి వస్తే తాను ఎంచుకున్న ప్యూర్ లవ్ స్టోరీ ప్లాట్ లైన్ ఇంకా మెరుగ్గా ఆవిష్కరించాల్సింది.

చిత్రం చూసినంత సేపు ఒకటే సీరియస్ నోట్ పై కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది.అంతే కాకుండా ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కూడా తక్కువ ఉండడం ఫస్ట్ హాఫ్ లో కాస్త డల్ స్క్రీన్ ప్లే లు కాస్త మైనస్ గా చెప్పొచ్చు.కానీ సెకండాఫ్ మరియు క్లైమాక్స్ లో సాగే ఎమోషనల్ సీన్స్ మరియు మలుపులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి.

అయితే ఓ ఇద్దరి ప్రేమికుల కథను సినిమా టైటిల్ కు తగ్గట్టుగా తీర్చి దిద్దడానికి చేసిన ఎమోషనల్ ప్రయత్నం మాత్రం అంత బాలేదని చెప్పాలి ఈ చిత్రంలోని క్లైమాక్స్ కాన్సెప్ట్ అందరినీ మెప్పించకపోవచ్చు.చాలా కాలం తర్వాత మిక్కీ సంగీతం కాస్త ఫ్రెష్ గా అనిపిస్తుంది.అలాగే చిత్రంలో కనిపించిన ఇతర పాత్రధారులు నాజర్,రోహిణి తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేకూర్చారు.

ప్లస్ పాయింట్స్ :

రాజ్ తరుణ్ మరియు షాలిని పాండేల మధ్య కెమిస్ట్రీ
పాటలు

మైనస్ పాయింట్స్ :

అంత ఎంటర్టైనింగ్ గా సాగకపోవడం
చాలా నెమ్మదిగా సాగే కథనం
రొటీన్ స్టోరీ

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే రాజ్ తరుణ్ మరియు జి ఆర్ కృష్ణ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మంచి లొకేషన్స్ సాంగ్స్ వంటివి ఆకట్టుకుంటాయి కానీ రొటీన్ స్టోరీ పైగా నిడివి తక్కువే అయినా కూడా బోరింగ్ గా సాగే కథనాలు ప్రేక్షకుడిని ఓవరాల్ గా ఖచ్చితంగా మెప్పించలేవు.ఓవరాల్ గా మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోవచ్చు.

Rating: 2.5/5