రివ్యూ : ‘పెంగ్విన్’ (కీర్తి సురేష్)

ఈశ్వ‌ర్ కార్తీక్ దర్శకత్వంలో మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన చిత్రం ‘పెంగ్విన్’. అమెజాన్ ప్రైమ్. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకం పై ద‌ర్శ‌కుడు, నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ‘అమెజాన్ ప్రైమ్‌’లో ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం వెండితెర ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

రిథమ్ (కీర్తి సురేష్) రఘు (లింగా) భార్యాభర్తలు. వారి కొడుకు (అజయ్) మిస్ అయిపోతాడు. ఎంతో కష్టపడి మిస్ అయిపోయిన కొడుకును వెతికి పట్టుకునే క్రమంలో రిథమ్ ఎంతో మానసిక సంఘర్షణ పడుతుంది. ఈ క్రమంలో రిథమ్ తన భర్తతో కూడా విడిపోవాల్సి వస్తోంది. ఆ తరువాత కొన్నేళ్ళకు ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. ఏడు నెలలు గర్భవతిగా ఉండి కూడా మిస్ అయిన కొడుకును వెతికి పట్టుకుంటుంది. అయితే అసలు రిథమ్ కొడుకునే ఎందుకు కిడ్నాప్ చేశారు ? ఆ చేసిన వ్యక్తి చార్లీ చాప్లిన్ గెటప్ లో ఎందుకు ఉన్నారు ? ఈ మధ్యలో రెండో బిడ్డ కూడా ప్రమాదంలో పడటం ? ఈ నాటకీయ పరిణామాల్లోనే ఆమె కిడ్నాపర్ ఎవరు అని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది ? ఈ మొత్తం క్రమంలో ఆమె తన ఇద్దరి బిడ్డలను ఎలా కాపాడుకున్నది ? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :

న్యూ యాంగిల్ లో ఓ తల్లి పాయింట్ అఫ్ వ్యూలో ఈశ్వ‌ర్ కార్తీక్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను తీసుకొవడం… దాన్ని స్క్రీన్ మీద ఇంట్రస్టింగ్ గా మలచడంలో ఈశ్వ‌ర్ కార్తీక్ దర్శకత్వ పనితనం బాగుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన చిత్రంగా ఈ సినిమాని మలిచారు. లోన్లీగా ఫీల్ అయ్యే ప్ర‌తి తల్లికి ఈ మూవీ కాన్సెప్ట్ క‌నెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర రిథమ్ (కీర్తి సురేష్) పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘పెంగ్విన్’ ఇంట్రస్ట్ గానే సాగింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ నుండి సస్పెన్స్ సీన్స్ అండ్ ఎమోషన్స్ ట్రీట్మెంట్ లో బాగా రాసుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మెయిన్ గా కొడుకు మిస్ అయ్యాక వెతికే సన్నివేశాల్లో మరియు డాక్టర్ సీక్వెన్స్ లో ఆమె నటన.. అలాగే ఆమె పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి. మొదటి భర్తగా నటించిన నటుడు లింగ, అలాగే భావన పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. డైరెక్టర్ షాట్ మేకింగ్ అండ్ అతని విజన్ చాలా బాగుంది.

అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. కొన్ని సన్నివేశాల్లో మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరోయిన్ కి ఇచ్చిన లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. పైగా
కథ కథనాలు మరీ విభిన్నంగా ఉండటంతో.. కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ రెగ్యులర్ సినిమాల మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ కు ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు. దానికి తోడూ మొదటి భాగం కథనంలో ప్లో అర్ధం కాకుండా ఉండడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతోంది. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్ :

కీర్తి సురేష్ నటన

ఎమోషనల్ గా సాగే మదర్ స్టోరీ

కొన్ని సప్సెన్స్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

కథాకథనాలు,

ప్లే బోర్ గా సాగుతూ బోర్ గా అనిపించడం,

అక్కడక్కడా స్లోగా నడిచే సన్నివేశాలు

కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం.

తీర్పు :

ఈశ్వ‌ర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ కొన్ని కీలక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అయితే, చాల సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా బోర్ గా సాగడం, సినిమాలో కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకి పెద్ద డ్రా బ్యాగ్స్ గా నిలుస్తాయి. మొత్తం మీద ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించదు.

Rating : 2.5/5