మూవీ రివ్యూ : “ఖైదీ”

కోలీవుడ్ కు చెందిన హీరోల్లో మన తెలుగు ఆడియన్స్ కు కూడా అత్యంత దగ్గరైన హీరోల్లో కార్తీ కూడా ఒకరు.తన సినిమా కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లోనే మన వాళ్ళు కార్తీను ఓన్ చేసుకున్నారు.కానీ ఈ మధ్య కాలంలో కార్తీ కు ఒక్క “ఖాకీ” తప్ప మరో చెప్పుకోదగ్గ హిట్టు పడలేదు.అయినా మరో ప్రయోగంతో కార్తీ ఒక విభిన్నమైన కథతో లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “ఖైదీ” తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబడిన ఈ చిత్రం ఈరోజే దీపావళి కానుకగా విడుదల అయ్యింది.మరి ఈ సినిమాతో అయినా కార్తీ సరైన హిట్టు కొట్టాడా లేదా అన్నది ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే ధిల్లీ(కార్తీ) ఒక పేరు మోసిన ఖైదీగా పదేళ్ల తర్వాత తన కూతురుని కలుసుకోడానికి బయటకు వస్తాడు.ఇదే నేపథ్యంలో ఓ డ్రగ్స్ మాఫియా ఒక ఐదుగురు పోలీస్ గ్రూప్ ను టార్గెట్ చేసి వారిని చంపెయ్యలని ప్లాన్ చేసి స్కెచ్ వేస్తారు.అసలు ఈ డ్రగ్స్ మాఫియా ఆ పోలీసులను ఎందుకు టార్గెట్ చేసారు?వీరికి ధిల్లీకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ధిల్లీ వెనుక ఉన్న కథ ఏమిటి?ఆఖరుకు ఆ ముఠా పోలీసులను ఏం చేసారు?అన్న అనేక విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

మొదటగా హీరో కార్తీ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ గా నిలిచారని చెప్పాలి. సినిమా మొదలయ్యిన దగ్గర నుంచి కూడా పూర్తయ్యేవరకు తన వన్ మాన్ షో చేసి ఒక్కరై సినిమాను తన భుజస్కందాలపై మోసారు.అయితే సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఒక సీరియస్ నోట్ లో అలా కొనసాగుతూ కథలో కీలక మలుపులతో మంచి ఆసక్తికరంగా మారుతుంది.అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే లారీ చేజింగ్ సీన్స్ సహా కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.కాకపోతే ఇవన్నీ మొదటి సగం పూర్తయ్యే వరకు పర్వాలేదనిపించే స్థాయిలో ఉంటాయి.

అలాగే సినిమాలో ఒకే పాయింట్ ప్లస్ గా మరియు మైనస్ గా నిలిచింది అని చెప్పాలి.అదేంటంటే సినిమా మొదలయినప్పటి నుంచి కూడా ఒక సీరియస్ నోట్ మీదనే కొనసాగుతుంది అందువల్ల అన్ని అంశాలను కోరుకొని వచ్చే వారికి మాత్రం కాస్త నిరాశ కలిగించొచ్చు.ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కాస్త కేర్ తీసుకొవాల్సింది.కాకపోతే కామెడి మిస్సయ్యిందనుకున్న సమయంలో ఒక సందర్భోచిత ఫన్నీ ఎపిసోడ్ ను మాత్రం దర్శకుడు కథనానికి తగ్గట్టు సూపర్బ్ గా ప్రెసెంట్ చేసారు.

ఇలా ఆధ్యంతం సీరియస్ గా కొనసాగే ఈ చిత్రం అదే సీరియస్ నెస్ ను సెకండాఫ్ లో కూడా కొనసాగిస్తుంది.అయితే ఒక్క సీరియస్ నెస్ కి తోడు కొన్ని ఎమోషన్స్ ను జోడించడం బాగా అనిపిస్తుంది.అలాగే క్లైమాక్స్ కార్తీ తన కూతురిని కలుసుకునే సన్నివేశం ఒకే ఒక్కటి ఉంటుంది కానీ అది కూడా ఎమోషన్ పరంగా చాలా బాగా వచ్చింది.ఇదొక్కటే కాకుండా తన ఫ్లాష్ బ్యాక్ ను చెప్పే సమయంలో కార్తీ ఎమోషనల్ నటన చాలా బాగుంది.అలాగే కార్తీతో సినిమా చివరి వరకు కొనసాగిన నరైన్ మంచి సపోర్టింగ్ రోల్ లో మంచి నటన కనబర్చారు.

ఇక దర్శకుని విషయానికి వచ్చినట్టయితే లోకేష్ షార్ట్ అండ్ కనెక్ట్ అయ్యే లైన్ ను ఎంచుకొని దాన్ని సరైన దిశలో ఎస్టాబ్లిష్ చేసారని చెప్పాలి.కాకపోతే సినిమా మొత్తం ఒకే సీరియస్ నోట్ పై నడవడం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోవచ్చు.ఈ ఒక్క విషయాన్ని మినహాయిస్తే కథ పరంగా కార్తీ లోకేష్ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు.అలాగే లోకేష్ రాసుకున్న కథకు సత్యన్ సూరన్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా సహజంగా కనిపిస్తుంది.అలాగే సామ్ సిఎస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

కార్తీ పెర్ఫామెన్స్

ఆసక్తికరంగా సాగే సెకండాఫ్

ఎమోషనల్ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

కమర్షియల్ హంగులు లేకపోవడం

తీర్పు :

మొత్తంగా చూసుకున్నట్టయతే కార్తీ మరియు దర్శకుడు లోకేష్ లు చేసిన ప్రయత్నం బాగుందని చెప్పాలి.సినిమా అంతా కాస్త సీరియస్ గా సాగడం,ఎలాంటి కామెడీ సీన్స్ లేకపోవడం,ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించే స్థాయిలో ఉండడం వంటివి పక్కన పెడితే ఆసక్తికరంగా సాగే క్లైమాక్స్ మంచి థ్రిల్లింగ్ సినిమాలను కోరుకునే ఆడియన్స్ కు మాత్రం కార్తీ “ఖైదీ” తప్పకుండా మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.

Rating : 3/5