మూవీ రివ్యూ : “మన్మథుడు 2”

కింగ్ నాగార్జున మరియు బ్యూటీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లు హీరో హీరోయిన్లు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “మన్మథుడు 2”. ఈ టైటిల్ లో లోనే ఒక మాయాజాలం ఉండడం అలాగే విడుదల చేసిన ట్రైలర్లు మరియు పాటలకు కూడా మంచి ఆదరణ లభించడంతో అక్కినేని అభిమానులు సహా ఇతర సినీ ప్రేక్షకులలో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఆ అంచనాలను “మన్మథుడు 2” టీమ్ ఎంత వరకు అందుకున్నారో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి చూద్దాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే సామ్(నాగార్జున) తన మొదటి ప్రేమ విఫలం అయ్యిన దగ్గర నుంచి ఒక ప్లే బాయ్ లా మారి అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అలా చాల కాలం గడిపేస్తున్న క్రమంలో.. సామ్ వయసు అయిపోతుందని అతని కుటుంబీకులు తొందర చేసి పెళ్లి చేసేద్దామనుకుంటారు. కానీ దాన్ని ఎలా అయినా చెడగొట్టాలని అవంతిక (రకుల్ ప్రీత్ సింగ్)ను తన గర్ల్ ఫ్రెండ్ గా నటించాలని ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. వీళ్లిద్దరు ఎలా పెళ్లిని చెడగొట్టాలని చూస్తారు ? ఈ నేపథ్యంలో ఎలాంటి ఫన్ జెనరేట్ అయ్యింది ? మధ్యలో వీరు ఎదుర్కున్న సమస్యలు ఏమిటి ? అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

విశ్లేషణ :

“మన్మథుడు” సినిమా అనగానే ఒకప్పుడు వచ్చిన క్లాసిక్ ఎంటర్టైనర్ గుర్తు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్ తో “మన్మథుడు 2″గా కింగ్ నాగార్జున మరోసారి రావడంతో అభిమానుల్లో మరియు సినీ ప్రేక్షకుల్లో కూడా ఒకరకమైన ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా మొదటి అర్ధ భాగం కూడా ఎక్కువగా ఎంటెర్టైన్మెంట్ పైనే బేస్ అయ్యి కొనసాగుతుంది. అయితే అసలు కథలోకి అప్పుడే వెళ్లకపోయినా సరే కథానుసారం అక్కడక్కడా వచ్చే ఫన్నీ సీన్స్ అయితే మాత్రం సినిమా చూసే ప్రేక్షకుడిని నవ్విస్తాయి. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగుంటాయి. సెకండాఫ్ మాత్రం ఎక్కువగా ఎంటర్టైనింగ్ గా సాగలేదు.
అలాగే క్లైమాక్స్ కు చేరుకునే సరికి నాగ్ మరియు రకుల్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బిలౌవ్ ఏవరేజ్ గా ఉన్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే 5 పదుల వయసులో కూడా ఇంత హ్యాండ్సమ్ లుక్ ని మైంటెయిన్ చెయ్యడం మాత్రం టాలీవుడ్ లో ఒక్క కింగ్ నాగార్జునకు మాత్రమే చెల్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకు తగ్గట్టుగానే సినిమా మొత్తం కింగ్ తన నటనతో ఆకట్టుకుంటారు.అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటనను కూడా మాట్లాడుకొని తీరాలి. స్వతంత్రంగా బ్రతికే ఒక బలమైన యువతిగా రకుల్ ఈ చిత్రంలో కనిపిస్తారు.
కథకు తగ్గట్టుగా తనదైన శైలిలో ప్రతీ ఫ్రేమ్ లోను మెరుగైన నటనను రకుల్ కనబరుస్తారు. ఒకపక్క అందాల ఆరబోతతో పాటుగా నటనతో కూడా రకుల్ మంచి నటనతో ఆకట్టుకుంటారు. ఇక సినిమా మొదటి నుంచి చివర వరకు ఉండే మరో పాత్ర వెన్నెల కిషోర్ తనదైన టైమింగ్ తో సినిమా మొత్తం హిలేరియస్ గా నడిపించే ప్రయత్నం చేశారు. మిగతా నటీనటులలో సీనియర్ నటి లక్ష్మి తన పాత్రకు సరైన న్యాయం చేకూర్చారు. అలాగే ఇతర నటీనటులు అయినటువంటి ఝాన్సీ, రావు రమేష్ లు వారి పాత్ర పరిధి మేరకు మెప్పిస్తారు. ఇక దర్శకుడి పనితనంకి వచ్చినట్టయితే ఒక ఫ్రెంచ్ సినిమా నుంచి తీసుకున్న చిన్న లైన్ ఆధారంగా రాహుల్ దానికి ఎక్కువ మోతాదులో ఫన్నీ ఎలిమెంట్స్ జోడించి సాగదీసినట్టుగా అనిపిస్తుంది.
ఈ రెండు అంశాలను రాహుల్ బ్యాలెన్స్ డ్ గా నడిపించి ఉండి ఉంటే బాగుండేది. ఎంటర్టైన్మెంట్ ను అధికంగా కోరుకునే వారికి వారికి అయితే ఈ సినిమా నిరాశ పరుస్తోంది. మొత్తానికి కథాకథనాల విషయంలో రాహుల్ కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఇక ఇతర సాంకేతిక వర్గం విషయానికి వచ్చినట్టయితే సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా బాగుంటుంది. అలాగే చైతన్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ అనిపిస్తోంది.

ప్లస్ పాయింట్స్ :

నాగ్ మరియు వెన్నల కిషోర్ ల మధ్య ఫన్ ట్రాక్

రకుల్ నటన

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో అక్కడక్కడా సాగే సన్నివేశాలు.
స్లో సాగే స్క్రీన్ ప్లే
అంతగా మెప్పించనిలేని పాటలు
ఆసక్తికరంగా మరియు బలంగా లేని క్లైమాక్స్

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మన్మథుడు 2 ఒక హిలేరియస్ గా సాగే ఎంటెర్టైనెంగ్ గా సినిమాని మలుద్దామని దర్శకుడు ప్రయత్నించినా అది ఆసక్తికరంగా సాగలేదు. అయితే కింగ్ నాగార్జున నటన మరియు రకుల్ గ్లామర్ మరియు నటన కథానుసారం వచ్చే కామెడీ సీన్స్ బాగా ఆకట్టుకోగా సెకండాఫ్ లో అక్కడక్కడా తడబాట్లు మైనస్ గా నిలుస్తుంది. ఈ వారాంతానికి ఈ సినిమాను కుటుంబంతో ఒకసారి చూడొచ్చు. బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలవొచ్చు.

Rating: 2.5/5