మూవీ రివ్యూ : నిను వీడని నీడను నేనే

గత కొంతకాలం నుంచి సరైన హిట్ లేని సందీప్ కిషన్ హీరోగా మొట్టమొదటి సారి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టి ముందు సినిమాల కన్నా భిన్నంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు “నిను వీడని నీడను నేనే” అనే సినిమాతో వచ్చారు.కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ కు కూడా మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఈ చిత్రం ఎంత వరకు మెప్పించిందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే సందీప్ కిషన్(రిషి), అన్య సింగ్(మాధవి)లకు అనుకోకుండా ఒక కారు ప్రమాదం జరుగుతుంది.అలా జరిగిన తర్వాత వారు ఒక స్మశానం నుంచి ఇంటికి వెళ్తారు.అప్పుడు అర్జున్ అద్దంలో చూసుకోగా తన మొహం కాకుండా వెన్నెల కిషోర్(అర్జున్) మొహం కనబడుతుంది.అసలు అద్దంలో చూసుకుంటే తాను కాకుండా ఇంకెవరో ఎందుకు కనిపిస్తున్నారు? అసలు ఈ రిషి ఎవరు? ఈ నేపథ్యంలో కథ ఎలా కొనసాగింది అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

చాలా కాలం తర్వాత సందీప్ నుంచి వచ్చిన “నిను వీడని నీడను నేనే” అనే ప్రయత్నం మెచ్చుకోదగినదే అని చెప్పాలి.సందీప్ కిషన్ మరియు అన్యల మధ్య వచ్చే కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంటుంది.సినిమా మొదటి సగం ముగిసే సరికి కాస్త సాగదీతగా అనిపించినా కాన్సెప్టు వలన ఆసక్తికరంగా కొనసాగుతుంది.అలాగే ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కూడా సెకండాఫ్ పై మంచి ఆసక్తిని రేకెత్తించడంతో సినిమా చూసే ప్రేక్షకుడికి ముందు ముందు ఏం జరుగుతుందా అన్న కుతూహలం పెరుగుతుంది.

ఈ విషయంలో కార్తీక్ రాజు మంచి మార్కులు సంపాదించారని చెప్పొచ్చు.అయితే మొదటి సగంలోనే కాస్త సాగదీత అనిపిస్తుంది,సెకండాఫ్ లో అయితే దీని మోతాదు ఇంకాస్త ఎక్కువగానే ఉన్నట్టు ప్రేక్షకుడికి అనిపిస్తుంది.ఈ విషయంలో కార్తీక్ కాస్త జాగ్రత్త వహించి ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.ఈ లాగ్ అనే విషయాన్ని పక్కన పెట్టినట్లతే సెకండాఫ్ కూడా మంచి ఆసక్తికరంగా కొనసాగుతుంది.అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ మరియు అందులో వచ్చే సందేశం సెకండాఫ్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

అయితే ఎంటెర్టైమెంట్ ఆశించే ఆడియన్స్ మాత్రం ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడమే బెటర్.ఇక నటీనటుల విషయానికి వస్తే సందీప్ నటన కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలాగే అన్య కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.మరో ముఖ్య పాత్రలో కనిపించిన వెన్నెల కిషోర్ కూడా తన రోల్ అద్భుతంగా పండించారు.ఇక మిగతా వారంతా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.సంగీత దర్శకుడు థమన్ అందించిన రెండు పాటలు బాగానే ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

సినిమా కాన్సెప్ట్
ఇంటర్వెల్ ట్విస్ట్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో సాగదీత
ఎంటెర్టైమెంట్ ఎలిమెంట్స్ లేకపోవడం

తీర్పు :

మొత్తానికి సందీప్ చేసిన ప్రయోగం బాగానే ఉందని చెప్పాలి.ఈ చిత్రానికి కాన్సెప్ట్ మరియు ఆసక్తికరంగా కొనసాగే కథనం ప్లస్ పాయింట్లుగా నిలవగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ లో కనిపించే లాగ్ అలాగే ఎంటెర్టైమెంట్ పాళ్ళు అంతగా లేకపోవడం మైనస్ పాయింట్లుగా నిలిచాయి.కానీ సందీప్ మరియు కార్తీక్ రాజులు చేసిన ప్రయత్నం వృధా కాలేదని చెప్పాలి.ఆసక్తికర కాన్సెప్టులను కోరుకునే ప్రేక్షకులు చూడానికి ఈ వారాంతంలో “నిను వీడని నీడను నేనే” బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

 

Rating: 3/5