మూవీ రివ్యూ : “RDX లవ్”

పాయల్ రాజ్ పుత్ పేరు ఇప్పుడు యూత్ లో ఒక సెన్సేషన్ “RX 100” సినిమాతో తెలుగు సినీ తెరకు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ కు ఇప్పుడున్న యువతలో ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.ఆ క్రేజ్ నిమిత్తం “హుషారు” ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా పాయల్ హీరోయిన్ గా శంకర్ బాను దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం “RDX లవ్” ఈ రోజే విడుదల అయ్యింది.పోస్టర్లు ట్రైలర్లతో మంచి అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్ళి తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే అలివేలు(పాయల్) ఎలా అయినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో పడాలని అలా చేసి ఒక్క అప్పాయింట్మెంట్ సంపాదించాలని ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పనులను చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలో హీరో తేజు ద్వారా ముఖ్యమంత్రిని కలిసే అవకాశాన్ని కల్పించుకుంటుంది.అయితే అలివేలు ఇలా ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలనుకుంటుంది?అసలు అలివేలు ఎవరు?ఈ నేపథ్యంలో తేజు పాత్రకు సంబంధం ఏమిటి? అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమాకు మొట్టమొదటి ఆకర్షణగా పాయల్ నే చెప్పాలి.పోస్టర్స్ లోని ట్రైలర్స్ లోని చూపించినట్టుగా పాయల్ ఈ చిత్రం అవసరం అయిన చోటల్లా తన అందచందాలతో పాయల్ నుంచి ఆమె అభిమానులు ఏం కోరుకుంటారో వాటితో కనువిందు చేస్తుంది.అయితే ఒక్క గ్లామర్ కు మాత్రమే పరిమితం కాకుండా పాయల్ అద్భుత ఇంతకు మునుపు సినిమాలో మనం చూసాం.అందుకు తగ్గట్టుగా ఈ చిత్రంలో కూడా కొన్ని ఎమోషన్స్ ను అద్భుతంగా పండించి ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచింది.

అలాగే హీరో తేజు కూడా ఈ సినిమాకు తన వంతు తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు.ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ విలన్ పాత్ర చాలా చక్కగా చేసారు.ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు వచ్చే చిన్న ట్విస్ట్,పాయల్ మరియు విలన్ ల మధ్య వచ్చే కబడ్డీ ఎపిసోడ్ బాగున్నాయి.అయితే ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత మాత్రం అసలు కథలోకి వెళ్లేందుకు ఫస్ట్ హాఫ్ మొత్తం తినేసినట్టు ఉంటుంది.

అలాగే అర్ధం కానీ కథనం సినిమా చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టింస్తుంది.అంతే కాకుండా కొన్ని కొన్ని సీన్లలో అయితే హాట్ నెస్ మోతాదు కూడా మితి మీరినట్టు అనిపిస్తుంది ఈ విషయంలో దర్శకుడు శంకర్ జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.కాకపోతే ఎక్స్ పోజింగ్ ను జోడించి మంచి సందేశం ఇద్దామనుకున్న దర్శకుని ప్రయత్నం మాత్రం హర్షణీయం అని చెప్పాలి.

కాకపోతే సినిమా కొనసాగుతున్నంత సేపు కూడా స్క్రీన్ ప్లే అంతా కాస్త గందరగోళంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది.ఇవన్నీ చివరిలో రివీల్ చెయ్యడం కూడా అంత కన్విన్సివ్ గా అనిపించదు.మొదట నుంచి హైలైట్ చేస్తున్న పాయల్ స్కిన్ షోకు సినిమా కథకు అసలు సంబంధం లేకపోయినా ఏదో హైప్ కోసం మాత్రమే చేసారని సినిమా చూసిన ప్రేక్షకుడికి అర్ధం అయ్యిపోతుంది.సీన్ సీన్ కు ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.కానీ రాధన్ అందించిన సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

పాయల్ పెర్ఫామెన్స్

చివరి 20 నిముషాలు

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

బోరింగ్ స్క్రీన్ ప్లే

దర్శకత్వం

తీర్పు :

మొత్తంగా చూసుకున్నట్టయితే పాయల్ తన అందచందాలతో పాటు మరోసారి అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది.అలాగే దర్శకుడు మంచి లైన్ ను ఎంచుకున్నా దాన్ని కేవలం కొన్ని ఎలిమెంట్స్ తో లేపి సక్సెస్ చేద్దామనుకున్న ప్రయత్నం మాత్రం పూర్తిగా నిరాశపరుస్తుంది.లాజిక్ లేని సన్నివేశాలు బోరింగ్ స్క్రీన్ ప్లే వంటివి సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయి.పాయల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఓ సారి చూడొచ్చు.

Rating: 2.5/5

మూవీ రివ్యూ : "RDX లవ్"
Overall
2.5
  • మొత్తంగా చూసుకున్నట్టయితే పాయల్ తన అందచందాలతో పాటు మరోసారి అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది.అలాగే దర్శకుడు మంచి లైన్ ను ఎంచుకున్నా దాన్ని కేవలం కొన్ని ఎలిమెంట్స్ తో లేపి సక్సెస్ చేద్దామనుకున్న ప్రయత్నం మాత్రం పూర్తిగా నిరాశపరుస్తుంది.లాజిక్ లేని సన్నివేశాలు బోరింగ్ స్క్రీన్ ప్లే వంటివి సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయి.పాయల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఓ సారి చూడొచ్చు.