మూవీ రివ్యూ : “రూలర్”

నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ హీరోగా బోయపాటి తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చిన కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సోనాల్ చౌహాన్ మరియు నివేదికలు హీరోయిన్లుగా నటించిన పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం “రూలర్”.బాలయ్య వర్కింగ్ స్టిల్స్ తోనే మంచి హైప్ ను తీసుకొచ్చిన ఈ చిత్రం ఈరోజే ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది.మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే తీవ్రమైన గాయాలతో దొరికిన బాలయ్యను పెద్ద వ్యాపారవేత్త అయినటువంటి జయసుధ చేరదీసి తన వ్యాపార లావాదేవీలకు అండగా ఉండాలని అతన్ని కూడా అతనికి ఓ గతం ఉంది అని తెలీకుండా పెద్ద బిజినెస్ మాగ్నెట్ గా మార్చేస్తుంది.అయితే ఇదే నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ లోని జయసుధకు ఓ చేదు ఘటన ఎదురవుతుంది.దానితో ఆమె బాలయ్యను అక్కడకు మాత్రం ఎప్పటికీ వెళ్ళొద్దని చెప్తుంది.కానీ ఊహించని పరిణామాల రీత్యా బాలయ్య అక్కడకు అడుగు పెడతాడు.అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది?అక్కడ ప్రకాష్ రాజ్ మరియు భూమికలకు బాలయ్యకు ఉన్న సంబంధం ఏమిటి?ఇక్కడ పోలీస్ రోల్ లో కనిపించే బాలయ్య ఎవరు?అతని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

గడిచిన దశాబ్ద కాలంలో బాలయ్యకు సరైన హిట్టు చిత్రాలు బోయపాటి శ్రీను ఇచ్చినట్టుగా మరో దర్శకుడు ఇవ్వలేదని చెప్పాలి.ఆ తర్వాత బాలయ్య ఎన్నో చిత్రాలు చేసినా అవి అంతగా వర్కౌట్ కాలేదు.అయితే కె ఎస్ రవికుమార్ తో చేసిన “జై సింహా”తో బోయపాటి రేంజ్ హిట్ అనకపోయినా మిగతా ప్లాప్ చిత్రాలను మించి హిట్ చిత్రాన్ని బాలయ్యకు అందించిన ఏకైక దర్శకునిగా రవికుమార్ నిలిచారు.అదే నమ్మకంతో ఇప్పుడు “రూలర్”తో ఇంకో అవకాశాన్ని ఇచ్చారు.

అయితే ఈ సినిమాకు బాలయ్య టోనీ స్టార్క్ లుక్ తోనే విపరీతమైన క్రేజ్ సంతరించుకున్నారు.అలా ఈ సరికొత్త లుక్ లో మాత్రం సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య స్టైలిష్ అల్ట్రా లుక్ లో అదరగొట్టారని చెప్పాలి.ఫస్ట్ హాఫ్ లో బాలయ్యపై వచ్చే ఈ మేకోవర్ సీన్స్ మరియు కొన్ని మార్క్ పంచ్ డైలాగ్స్ బాలయ్య నుంచి ఏమైతే కోరుకొని థియేటర్ కు జనం వాస్తారో వారికి ఫుల్ మీల్స్ లా ఉంటుంది.ఇలా బాలయ్య సరికొత్త మేకోవర్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ సహా ఇంటర్వెల్ బ్లాక్ లోని కొన్ని సీన్స్ డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

అయితే అప్పటి వరకు బాగానే తీసుకొచ్చిన దర్శకుడు ఏమాత్రం ఆసక్తికరంగా ఉండని రొటీన్ ట్విస్ట్ తో సినిమా ఫ్లోకు దెబ్బేసారు.అలాగే సెకండాఫ్ కు వచ్చేసరికి టాలీవుడ్ కీ కమెడియన్స్ తో ఫస్ట్ హాఫ్ లోలానే సెకండాఫ్ లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే ప్రయత్నం చేసారు.కానీ అక్కడ నుంచే కథ కథనం రొటీన్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది.ఈ విషయంలో రవికుమార్ గారి దర్శకత్వానికి మార్కులు వెయ్యలేం.అలాగే యాక్షన్ సీన్స్ వల్ల వైలెన్స్ కూడా కాస్త ఎక్కువయ్యినట్టే అనిపిస్తుంది.

కాకపోతే రైతులకు సంబంధించిన ఎపిసోడ్స్ కానీ బాలయ్యతో చెప్పించిన డైలాగ్స్ కానీ బాగుంటాయి.కాకపోతే రొటీన్ కాన్సెప్ట్ మూలాన సెకండాఫ్ లో ఏమంత కొత్తదనం ఉండదు.వీటికి తోడు అనుకున్నట్టుగానే బాలయ్య పోలీస్ లుక్ చాలా నిరాశ పరుస్తుంది.అసలు ఆ లుక్ ఎందుకు ట్రై చేసారో వారికే తెలియాలి.ఇవి ప్రధానంగా నిరాశపరుస్తాయి అని చెప్పాలి.అలాగే హీరోయిన్స్ కు కూడా పెద్దగా స్కోప్ ఉండదు.చిరంతన్ భట్ అందించిన సంగీతం కానీ బాక్గ్రౌండ్ స్కోర్ కానీ అప్ టు మార్క్ అనిపించవు.

ప్లస్ పాయింట్స్ :

బాలయ్య పెర్ఫామెన్స్ మరియు డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ

ఊహించదగ్గ కథనం మరియు ట్విస్టులు

పోలీస్ గెటప్ లో బాలయ్య లుక్స్

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే బాలయ్య మరియు కె ఎస్ రవికుమార్ ల కాంబోలో తెరకెక్కిన ఈ రెండో చిత్రం “రూలర్” అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించకపోవచ్చు.మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే డైలాగ్స్ ఓ మోస్తరుగా ఆకట్టుకున్నా అదే రొటీన్ కథ మరియు కథనాలు బాగా దెబ్బ తీసేసాయి.వీటి మూలాన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచిపోవచ్చు.

Rating: 2/5