మూవీ రివ్యూ : సవారి

నటుడు నందు హీరోగా ప్రియాంక శర్మ హీరోయిన్ గా “బంధం రేగడ్” అనే షార్ట్ ఫిలింతో 2018లో ప్రతిష్టాత్మక “సైమా” బెస్ట్ షార్ట్ఫిల్మ్ అవార్డు అందుకున్న సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సవారి”. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం ట్రైలర్ మరియు పాటలతో ఆకట్టుకొని మంచి బజ్ ను సంతరించుకుంది. మరి ఈ చిత్రం వెండితెర ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే రాజు(నందు) ఓ సాధారణ దిగువు తరగతి యువకుడు.తన వంశపారంపర్యంగా వచ్చే సవారి వృత్తిని చేసుకుంటూ తన జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో తన గుర్రం(బాద్షా)అంటే ప్రాణం ఇచ్చేంత నింపుకుంటాడు.అలాగే దాని తర్వాత అంతే స్థాయిలో భాగీ(ప్రియాంక శర్మ) అనే అమ్మాయిని కూడా ప్రేమిస్తాడు. కానీ ఊహించని పరిణామాల రీత్యా ఓ రోజు బాద్షా మిస్సయ్యిపోతుంది.అలా తాను ఎంతగానో ప్రేమించే బాద్షా ఎందుకు మిస్సయ్యింది?దానికి గల కారకులు ఎవరు?అది దొరికిందా లేదా?ఇందులో హీరోయిన్ రోల్ కు ఎంత వరకు ఇంపార్టెన్స్ ఉంది?అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర మీద చూడాల్సిందే.

 

విశ్లేషణ :

ఈ సినిమాలో హీరోగా నటించిన నందు గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్స్ తో చాలా ఫ్రెష్ గా రఫ్ గా కనిపించాడు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే సినిమాగా ఈ చిత్రం నందు కెరీర్ లో నిలిచిపోతుంది. హీరోయిన్ తో ప్రేమలో పడే సన్నివేశాల్లో గాని, కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో గాని ముఖ్యంగా క్లైమాక్స్ లో నందు సెటిల్డ్ గా చాల చక్కగా నటించాడు. అలాగే చిన్న చిన్న మ్యానరిజమ్స్ తో తాను కనబర్చిన నటనా తీరు చాలా బాగుంది. అలాగే పలు కీలకమైన ఎమోషనల్ ఎపిసోడ్స్ లో సినిమా చూసే ప్రేక్షకునికి కూడా ఆ ఫీల్ ను తీసుకొచ్చే విధంగా సినిమా మొత్తం తానే నడిపించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక హీరోయిన్ ప్రియాంక శర్మ కూడా మంచి నటనను కనబర్చింది. అలాగే సినిమా అంతా మంచి పక్కా మాస్ అమ్మాయిగా కనిపించి తన చక్కని హావభావాలతో ఏ సీన్ కు ఎలా కావాలో అలా తనని తాను మలచుకున్న విధానం బాగుంది. ముందే హిట్టయిన రెండు ట్రాక్స్ నీ కన్నులు సాంగ్ మరియు ఉండిపోవా పాటలు విజువల్ గా కూడా అంతే స్థాయిలో బాగున్నాయి. ఇంకా విలన్ రోల్ లో కనిపించిన శ్రీకాంత్ రెడ్డి ఒక పక్క విలజనిజం మరో పక్క దానితోనే కామెడీ యాంగిల్ బాగా క్యారీ చేసారు.అతనికి మరియు అతని గ్యాంగ్ మధ్య వచ్చే ప్రతీ కామెడీ ట్రాక్ బాగుంది. దీనిని దర్శకుడు బాగా ప్రిపేర్ చేసుకున్నారు. అలాగే ఇతర పాత్రల్లో నటించిన శివ కుమార్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే హీరోహీరోయిన్ల పాత్రలకు మధ్య వ్యతాస్యం ఆకట్టుకున్నా.. కథాకథనాల పరంగా మాత్రం సినిమా ఆకట్టుకునే విధంగా సాగలేదు. ఫేక్ ఎమోషన్స్ తో లాజిక్ లేని స్క్రీన్ ప్లేతో సినిమా సాగింది. అయితే మొదటి భాగంలో కొన్ని సీన్స్ సరదాగా సాగుతూ పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమాలో బలమైన కాన్ ఫిల్ట్ మిస్ అయింది. పైగా సెకెండ్ హాఫ్ మొత్తం హీరోహీరోయిన్లు మధ్య కొన్ని లవ్ సీన్స్ అనవసరంగా సాగతీశారు. దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత మరి ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. స్లమ్ ఏరియాలో ఉంటూ ఒక గుర్రం నడుపుకునే కుర్రాడు, రిచ్ క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడటం, చిన్న చిన్న మేలో డ్రామా ఇన్సిడెంట్ల కారణంగా ఆ ప్రేమను ఆ అమ్మాయి కూడా ఫీల్ అవ్వడం, వీటికి తోడు వీళ్ళద్దరూ ప్రేమకు ఒక విలన్.. అతని వల్ల వీళ్ళ లవ్ స్టోరీలో సమస్యలు రావడం ఇలా బలం లేని సీన్స్ తో సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

 

ప్లస్ పాయింట్స్ :

నందు నటన

ఎమోషనల్ గా సాగే బోల్డ్ లవ్ స్టోరీ

కొన్ని కామెడీ సీన్స్

సాంగ్స్

 

మైనస్ పాయింట్స్ :

కథాకథనాలు,

ప్లే బోర్ గా సాగుతూ రొటీన్ గా అనిపించడం,

అక్కడక్కడా స్లోగా నడిచే సన్నివేశాలు

కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం.

 

తీర్పు :

నందు హీరోగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బోల్డ్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ తో కొంతవరకు ఆకట్టుకున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

అయితే బి,సి సెంటర్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా కొన్ని సీన్స్ ఉండటం కలిసొచ్చే అంశం. ఇక నందు నటన, కామెడీ సన్నివేశాలు చిత్రానికి ప్లస్ అయ్యాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.

Rating: 2.5/5