రివ్యూ : టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ క్వారంటైన్ (యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్)

గత కొన్ని నెలల కితం ప్రపంచాన్ని అనుకోకుండా పలకరించిన అతిధి “కరోనా”. దీని ప్రభావం ఇంకా మన దేశంలో ఎక్కువగా లేని సమయంలో ఎన్నో ట్రోల్స్, మేమ్స్ మన వాళ్ళు వేశారు. ఒక్కసారిగా లాక్ డౌన్ పడ్డాక అప్పుడు అసలు గేమ్ మొదలయ్యింది.

అందులో భాగంగా పలు షార్ట్ ఫిల్మ్ లు కూడా ఎంటర్టైనింగ్ కోణంలో వచ్చాయి. అలాంటి షార్ట్ ఫిల్మ్స్ ను అందివ్వడంలో ముందుండే “తమడా మీడియా” వారి నుంచి వచ్చిన షార్ట్ ఫిల్మ్ ” టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ క్వారంటైన్”. ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చి చాలా రోజులు అయ్యింది. మరి ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి.

టీం : –

కనిపించిన వారు : రవితేజ నన్నిమల, ఎన్ హర్ష వర్ధన్, పి.వి.సాయి సోమయాజులు(రాసింది కూడా)
కెమెరా వర్క్ : నన్నిమాల ఫ్యామిలీ
ఎడిటింగ్ : సాయి కృష్ణ గణల

కాన్సెప్ట్ :

మనుషుల్లో ఎలా అయితే భిన్న స్వభావం కలవారు ఉంటారో ఆయా పరిస్థితుల రీత్యా నడుచుకుంటారు అలాంటి మనుషులు ఈ క్వారంటైన్ లో ఒక్కొక్కరూ ఒక్కో రకమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అలాంటి వారు ఈ క్వారంటైన్ లో ఎలా ఉన్నారో ఎలా కాలయాపన చేసారో అన్నది ఫన్నీగా చూపడమే వీరి కాన్సెప్ట్.

ఎలా ఉంది?

వీరి టీం ఎంచుకున్న కాన్సెప్ట్ ఈ సమాయంలో ప్రతీ ఒక్కరికీ బాగా కనెక్ట్ అయ్యేలా తీసుకున్నారు.అందుకు తగ్గట్టుగానే నటులు రవి మరియు హర్ష వర్ధన్ లు మంచి ఈజ్ తీసుకొచ్చారు. పెర్ఫామెన్స్ పరంగా బాగానే ఉన్నా ఇందులో మెయిన్ థీమ్ ఎంటర్టైన్మెంట్. రైటర్ సాయి ఎంచుకున్న రోల్స్ మొదట్లో చాలా సింపుల్ గా సాదాసీదాగా ఉండటం వల్ల ఖచ్చితంగా స్టార్టింగ్ తక్కువ మంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఇండోర్ గేమ్స్ లో చెస్ గేమ్ నుంచి యూట్యూబ్ వీక్షకులకు కావాల్సిన ఫన్నీ స్టఫ్ మొదలవుతుంది. అలాగే లాక్ డౌన్ ను పెంచుకుంటూ తీసుకెళ్లడం వీరు ముసలాళ్ళు అవ్వడం వంటివి మంచి ఫన్ ను జనరేట్ చేసాయి.

ఫైనల్ గా :

ఇప్పటికే ఈ షార్ట్ ఫిల్మ్ ను చాలా మంది చూసి ఉంటారు. వివిధ రకాల మనుషులు క్వారంటైన్ లో ఎలా గడుపుతున్నారు అన్నది సింపుల్ కాన్సెప్ట్ అయినా ఈ టైం లో చేసారు కాబట్టి చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఇది మేజర్ ప్లస్ పాయింట్. అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారు అయితే రెండు నుంచి నాలుగు నిమిషాలు స్కిప్ చేసేస్తే బెటర్, అలాగే ఫైనల్ గా ఒక్కసారి చూడ్డానికి అయితే ఈ షార్ట్ ఫిల్మ్ బాగుంటుంది.

రేటింగ్: 3.5/5

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి