మూవీ రివ్యూ: “సీత”


బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ డైరెక్ట్ చేసిన :”సీత” మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మోడ్రన్ సీత అనే కాన్సెప్ట్ తో తేజ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఆ నమ్మకాన్ని సినిమా ఎంత వరకు నిలబెట్టుకుందో ఇప్ప్డుడు సమీక్షిద్దాం.

కథ:
తన ఉన్నతి కోసం దేనికైనా తెగించే స్వార్ధ బుద్ధి కలిగిన సీత(కాజల్), ఏమిచేయడానికైనా వెనుకాడడు. ఇలాంటి తత్వం కలిగిన సీత అక్కడ లోకల్ ఎం ఎల్ ఏ అయిన బసవ(సోనూసూద్) తో ఐదు కోట్ల రూపాయల ఒప్పదం కుదుర్చుకుంటుంది. దురదృష్టవశాత్తు ఈ ఒప్పందం సీత ను చిక్కుల్లోకి నెడుతుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి సీత, అమాయకుడైన(శ్రీనివాస్ బెల్లంకొండ) రఘురాం ను వాడుకోవాలని ప్లాన్ వేస్తుంది. ఈ క్రమంలో సీత కోరిక నెరవేరిందా…?బసవ నుండి ఎలా తప్పించుకోంది అనేది స్క్రీన్ మీద చూడాలి.

సమీక్ష:
నేటి తరం అమ్మాయిలలో కనిపిస్తున్న స్వార్థం, ధనాశ వంటి లక్షణాలను కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న సీత పాత్ర ద్వారా ప్రేక్షకులకు తెలియజేయాలని తేజ ప్రయత్నించాడు అనిపిస్తుంది. ఆ ఒక్క విషయం మినహాయిస్తే సీత స్టోరీ ఎప్పటిలాగే పాత ఫ్యామిలీ డ్రామానే. సినిమా చూస్తున్న ఆడియన్స్ కి కొత్తగా ఏమి అనిపించదు. దర్శకుడు తేజ కేవలం సీత పాత్ర ను బాగా చూపించాలనే తాపత్రయంతో తన దృష్టి మొత్తం అక్కడే పెట్టి సినిమా కథనం ను నిర్లక్ష్యం చేసాడనిపించింది. సీత పాత్ర పై పెట్టిన దృష్టి కథనం పైన కూడా పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేది.

డిఫరెంట్ షేడ్స్ ఉన్న సీత పాత్రకు కాజల్ న్యాయం చేసింది. ప్రతి పాత్రలో ఆమె నటన చాలా సహజంగా అనిపిస్తుంది. కాజల్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై తీసుకెళ్లింది అని చెప్పాలి.
ప్రపంచంలో ఉన్న మనుషులు వారి లోతులు తెలియని అమాయక వ్యక్తిగా శ్రీనివాస్ బాగా చేసారు. క్లైమాక్స్ లో ఆయన నటన సన్నివేశాలకు జీవం పోసింది. కామెడీయన్ బిత్తిరి సత్తి ప్రేక్షకులను నవ్వించడంలో కొంతవరకు విజయం సాధించాడు.

ప్లస్ పాయింట్స్:
కాజల్ యాక్టింగ్
పాయల్ రాజపుట్ స్పెషల్ సాంగ్

మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ
కథనం
పొంతనలేని సన్నివేశాలు

తీర్పు:

స్వార్థపరురాలైన యువతి అమాయకుడైన యువకుడు పాత్రలను బ్యాలన్స్ చేయడంలో తేజా ఫెయిల్ అయ్యాడు. తేజ “సీత” అంతగా ఆకట్టుకోదు