మూవీ రివ్యూ : “తిప్పరా మీసం”

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ అండర్ రేటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు.తనకి ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే చాలా ఈజ్ తో నటిస్తాడు.అంతే కాకుండా మంచి మంచి సబ్జక్ట్స్ కూడా ఎన్నుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అలా ఇప్పుడు తాను హీరోగా నిక్కీ తంబోలి హీరోయిన్ గా కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో వైవిధ్య చిత్రం “తిప్పరా మీసం”.పోస్టర్స్ మరియు వీడియోస్ తో మంచి ఆసక్తిని ఏర్పర్చిన ఈ చిత్రం ఈరోజే విడుదల అయ్యింది.మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే శ్రీవిష్ణు ఒక పబ్ లో డీజే గా పని చేస్తుంటాడు.అదే విధంగా జల్సాలకు అలవాటు పడి విపరీతంగా బెట్టింగ్స్ చేస్తుంటాడు.అలా బెట్టింగ్స్ కు అలవాటు పడ్డ శ్రీ జీవితం ఒక్కసారిగా ఉహించని మలుపు తిరుగుతుంది.అలా శ్రీ లైఫ్ లో చోటు చేసుకున్న మలుపు ఏమిటి?శ్రీ జూదానికి అంతలా బానిసగా మారిపోవడానికి గల కారణాలు ఏమిటి?తన తల్లినే అమితంగా ద్వేషించడానికి ఏదన్న బలమైన కారణం ఉందా?శ్రీ జీవితంలో చోటు చేసుకున్న మలుపు వల్ల అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ చిత్రానికి మొట్టమొదటి బలం హీరో శ్రీ విష్ణుయే అని చెప్పాలి.ఇది వరకే మనం శ్రీవిష్ణు చేసిన ఎన్నో పాత్రలను చూసాం.తనకిచ్చిన ఏ పాత్ర అయినా సరే చాలా ఈజ్ గా సునాయాసంగా చేసేస్తాడు.అలా ఒక సరికొత్త శ్రీవిష్ణు ఈ చిత్రం ద్వారా కనిపిస్తాడు.యాంగ్రీ యంగ్ మెన్ గా శ్రీ విష్ణు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలిచారు.అలాగే హీరోయిన్ నిక్కీ తంబోలి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చింది.అంతే కాకుండా శ్రీవిష్ణు మరియు అతని తల్లికి సంబంధించిన ప్రతీ ఎమోషనల్ ఎపిసోడ్ కూడా బాగుంటుంది.ముఖ్యంగా సినిమాలో లాస్ట్ 10 నిమిషాలు సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

అలాగే శ్రీ తల్లిగా చేసిన రోహిణి మరోసారి అద్భుత నటన పండించారు.ఇక దర్శకుడు కృష్ణ విజయ్ విషయానికి వచ్చినట్టయితే తాను అనుకున్న పాయింట్ ను తెరకెక్కించే క్రమంలో దానిని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయాన్నే తీసుకున్నారని చెప్పాలి.సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక్క శ్రీవిష్ణు పాత్రనే హైలైట్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు.దాని వల్ల శ్రీవిష్ణు నుంచి మంచి సబ్జెక్టు ఉన్న చిత్రాన్ని చూస్తున్నామన్న ప్రేక్షకుల ఫీలింగ్ మెల్లగా నీరుగారడం మొదలవుతుంది.

అందుకు తోడు నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే సినిమాపై ఏమంత ఆసక్తిని కనబర్చవు.కేవలం కొన్ని కొన్ని అంశాలు మినహాయిస్తే మిగతా సినిమా అంతా సోసోగా ఉంటుంది.అలాగే కొన్ని బెట్టింగ్ సీన్స్ మరియు ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ వంటి ఎపిసోడ్స్ కాస్త ఆసక్తికరంగా అనిపించించినా ఓవరాల్ గా మాత్రం సినిమా జస్ట్ ఒకే అనిపిస్తుంది.కానీ ఇతర సాంకేతిక వర్గం విషయానికి వస్తే మాత్రం మొదటి ఫ్రేమ్ నుంచి కూడా సిడ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది.

అంతే కాకుండా సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి సినిమాకు మరింత ప్లస్ అయ్యారు.కేవలం పాటలు మాత్రమే కాకుండా మంచి నేపధ్య సంగీతం కూడా అందించారు.కానీ దర్శకత్వం మాత్రం సినిమాను దెబ్బ తీసింది.డ్రగ్ అడిక్ట్ మరియు అగ్రెసివ్ హీరో వంటివి మనం ఇది వరకే చూసేసాం ఈ అంశాలు అంత కొత్తగా ఏమి అనిపించవు.అలాగే ఎంతో కీలకమైన స్క్రీన్ ప్లే కూడా అంతగా మెప్పించదు. ఈ విషయాల్లో కృష్ణ విజయ్ పలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

శ్రీవిష్ణు

సినిమాటోగ్రఫీ మరియు సంగీతం

చివరి పది నిమిషాలు

మైనస్ పాయింట్స్ :

కథ

దర్శకత్వం

తీర్పు :

మొత్తంగా చూసుకున్నట్టయితే టాలీవుడ్ మోస్ట్ అండర్ రేటెడ్ హీరో శ్రీ విష్ణుని మరో కోణంలో దర్శకుడు కృష్ణ విజయ్ అద్భుతంగా చూపించారు.అలాగే మంచి ఎమోషనల్ ఎపిసోడ్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవగా పేలవమైన కథ మరియు దర్శకత్వం సినిమా సోల్ ని పూర్తిగా దెబ్బ తీశాయి.ఈ కారణాల చేత ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోవచ్చు.

Rating: 2/5