మూవీ రివ్యూ : “వెంకీ మామ”

విక్టరీ వెంకటేష్ మరియు నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యలు హీరోలుగా రాశి ఖన్నా మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా కె ఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ చిత్రం “వెంకీ మామ”. కేవలం సినిమా పరంగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మామ అల్లుళ్ళు అయినటువంటి ఈ ఇద్దరి కాంబోను చూసేందుకు ఇద్దరి ఫ్యామిలీల అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు.మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే కార్తీక్(నాగ చైతన్య) తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు.దానితో కార్తీక్ భాధ్యతను అతని మావయ్య వెంకట రత్నం(వెంకటేష్)తీసుకుని తన జీవితం మొత్తం కార్తీక్ కోసమే త్యాగం చేస్తాడు.కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా కార్తీక్ భారత ఆర్మీలో వెంకీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేరిపోతాడు.ఇదే నేపథ్యంలో కార్తీక్ ఆ ఆర్మీ క్యాంపులో అకస్మాత్తుగా మిస్సయ్యిపోతాడు.అసలు కార్తీక్ ఆర్మీలో చేరడానికి కల ముఖ్య కారణం ఏమిటి? అతను ఎలా మిస్సయ్యాడు?కథనంలో ఏర్పడే చిక్కులను అధిగమించి అతని మావయ్య వెంకీ అతన్ని ఎలా కనుగొన్నాడు అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

వెంకటేష్ మరియు చైతూల కాంబోలో ఓ సినిమా అనగానే మరో మాంచి మల్టి స్టారర్ చూడబోతున్నామని తెలుగు ప్రేక్షకులు తప్పక అనుకుంటారు.వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో వెంకీ మరియు చైతులు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చారు.వీరిద్దరూ కనిపించే ప్రతీ ఫ్రేమ్ కూడా మంచి ఎంటర్టైనింగ్ గా ప్రేక్షకులకు కనుల పండుగగా ఉంటుంది.వీరి ఫ్యాన్స్ కి అయితే అది మరింత నచ్చొచ్చు.అలాగే వీరిద్దరికీ లీడ్ పెయిర్స్ గా నటించిన పాయల్ మరియు రాశి ఖన్నాలు కూడా వీరితో పోటాపోటీగా మంచి నటనను కనబరచడమే కాకుండా ఈ రెండు జంటల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.

అలాగే వీరి మధ్యలో వచ్చే పాటలు కానీ కామెడీ ఎపిసోడ్స్ కానీ ప్రేక్షకులను మెప్పిస్తాయి.అలాగే ఇతర కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్,నాజర్ మరియు రావు రమేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పిస్తారు.అయితే ఈ చిత్రంపై ప్రేక్షకులు తప్పకుండ మంచి అంచనాలను పెట్టుకోని ఉంటారు.కానీ ఆ అంచనాలను రీచ్ అవ్వడానికి బాబీ చేసిన ప్రయత్నం మరింత అర్ధవంతంగా ఉండి ఉంటే మరింత బాగుండేది.ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఇన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏంటి?అన్న ఆలోచన రాకమానదు.ఒకటి అయితే మరొకటి ఒకదాంట్లోనే మరొకటి ఇలా తరచు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల మీదే చిత్రాన్ని బాబీ నడిపించినట్టుగా అనిపిస్తుంది.

అందువల్ల స్క్రీన్ ప్లే పై కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటే బాగుండేది.అలాగే అక్కడక్కడా వచ్చే కామెడీ ఎపిసోడ్స్ కానీ ఫస్ట్ హాఫ్ లోని ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండే ఎమోషనల్ ఎపిసోడ్స్ తప్పకుండ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా సినిమాలోని ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యే అవకాశం ఉంది.అలాగే క్లైమాక్స్ లోని చైతు మరియు వెంకీల మధ్య ఎమోషనల్ సీన్ అయితే చిత్రానికి ప్రధాన బలం అని చెప్పొచ్చు.అలాగే థమన్ ఇచ్చిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగుంటాయి.ప్రసాద్ మూరెళ్ల అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు మాత్రం అప్ టు మార్క్ ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

వెంకీ మరియు చైతూల పెర్ఫామెన్స్
ఫస్ట్ హాఫ్ లోని కామెడీ ట్రాక్స్

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా ఎక్కువగా చూపించడం

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే వెంకీ మరియు చైతుల కాంబో లో తెరకెక్కిన “వెంకీ మామ”తో వచ్చిన ఈ ఇద్దరు మామ అల్లుళ్ళు ప్రేక్షకులను బాగానే మెప్పించారని చెప్పొచ్చు.ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ మరియు బలమైన ఎమోషన్స్ మెయిన్ హైలైట్ అవ్వగా సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం మూలాన ఎక్కువగా ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను హ్యాండిల్ చెయ్యకపోవడం కాస్త నిరాశ పరుస్తుంది.ఓవరాల్ గా మాత్రం ఈ చిత్రం ఈ వారాంతానికి ఫ్యామిలీతో తప్పక చూడొచ్చు.

Rating: 3/5