మూవీ రివ్యూ : “విజయ్ సేతుపతి”

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా రాశిఖన్నా హీరోయిన్ గా దర్శకుడు విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “విజయ్ సేతుపతి”. పేట మరియు సైరా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యిన విజయ్ మొదటిసారిగా తన ఫుల్ లెంగ్త్ డబ్బింగ్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు.మరి ఈ చిత్రం టాలీవుడ్ జనాన్ని ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే విజయ్ సేతుపతి(చరణ్) సినిమాల్లో నటునిగా అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.ఈ క్రమంలో హీరోయిన్ రాశిఖన్నాతో పరిచయం ఏర్పడుతుంది.కానీ ఆమె పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయ్యినటువంటి రవికిషన్ కూతురు.ఈ రవి కిషన్ కు సంబంధించిన ఓ కెమికల్ ఫ్యాక్టరీ రామాపురం అనే ఊర్లో పెట్టాలని ప్రయత్నించగా అక్కడ ఉన్న విజయ్ సేతుపతి అడ్డుపడతాడు.ఇలా అడ్డుగా ఉన్న విజయ్ సేతుపతిని అదే గ్రామానికి చెందిన పొలిటిసియన్ అషుతోష్ రానా ఏం చేసాడు?అసలు చరణ్ కు ఈ కథకు సంబంధం ఏమిటి?రాశిఖన్నా పాత్రకు ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా?ఆ ఊరిలోకి ఆ కెమికల్ ఫ్యాక్టరీను రాకుండా ఎవరు ఆపారు లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

విశ్లేషణ :

ఇప్పటి వరకు విజయ్ సేతుపతి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఫుల్ లెంగ్త్ లో చూడలేదు.ఆ మధ్య వచ్చిన “పేట” అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ “సైరా” చిత్రాల్లో సేతుపతి కనిపించారు.అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యిన సేతుపతి ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసారు.ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ లో కానీ కామెడీ సీన్స్ లో కానీ విజయ్ అద్భుత నటన కనబర్చారు.ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోయే సేతుపతి ఈ చిత్రంలో కూడా రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపించి ఆకట్టుకుంటారు.

అలాగే కమెడియన్ సూరితో మొదటి నుంచి చివరి వరకు ఉన్న కామెడీ ట్రాక్స్ అయితే సూపర్బ్ గా వచ్చాయి.ఇంకా ఫస్ట్ హాఫ్ లోని ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ ఫస్ట్ హాఫ్ అంతటికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.ఫస్ట్ హాఫ్ వరకు మంచి ఎంటర్టైనింగ్ గా కొనసాగిన చిత్రం సెకండాఫ్ లో అదే జోరు కొనసాగిస్తుంది అనుకుంటే దర్శకుడు విజయ్ చందర్ దానిపై నీళ్లు జల్లారు.అదే పాత రొటీన్ కార్పొరేషన్ పొలిటికల్ డ్రామాగా తీసి నిరుత్సాహ పరిచారు.రెండు మూడు సినిమాలు కలిపి కొట్టినట్టుగా సెకండాఫ్ చూసాక ప్రేక్షకుడికి ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది.

అలాగే సాగదీతగా కొనసాగే సెకండాఫ్ మరింత మైనస్ గా నిలిస్తుంది.ఇక హీరోయిన్స్ విషయానికి వచ్చినట్టయితే రాశీ ఖన్నాకు మంచి రోల్ ఇచ్చారు.ఫస్ట్ హాఫ్ లో రాశి తన నటనతో పాటు గ్లామర్ ను కూడా చూపించి ఆకట్టుకుంది.అలాగే నివేత పెతురాజ్ తన పాత్ర నిడివి తక్కువే అయినా తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది.కాకపోతే సెకండాఫ్ కు వచ్చిన తర్వాత మాత్రం రాశి ఖన్నా పాత్రను కాస్త పక్కకు పెట్టేసినట్టుగా అనిపిస్తుంది.

ఇక దర్శకత్వం విషయానికి వస్తే విజయ్ చందర్ ఫస్ట్ హాఫ్ ను తెరకెక్కించనంత చక్కగా సెకండాఫ్ ను మలచలేకపోయారు.ఫస్ట్ హాఫ్ కాస్త భిన్నంగా ట్రై చేసి ఆకట్టున్నా సెకండాఫ్ లో రొటీన్ స్టోరీ పెట్టేసి దెబ్బ తిన్నారు.ఇక చిత్రానికి సంగీతం అందించిన వివేక్ – మెర్విన్ లు పాటలు ఒకే అనిపిస్తాయి.కానీ సేతుపతికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.అలాగే ఆర్ వేల్ రాజ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.

 

ప్లస్ పాయింట్స్ :

సేతుపతి మరియు సూరిల మధ్య కామెడీ ట్రాక్
ఫస్ట్ హాఫ్

 

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
రొటీన్ స్టోరీ

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన “విజయ్ సేతుపతి” చిత్రం హిలేరియస్ కామెడీ ట్రాక్స్ ఎంటర్టైనింగ్ గా సాగే ఫస్ట్ హాఫ్ లతో ఆకట్టుకున్నా కొత్తదనం లేని కథ రొటీన్ స్క్రీన్ ప్లే లతో సినిమా సోల్ ను దర్శకుడు దెబ్బ తీశారు.కథ పరంగా ఆకట్టుకోకపోయినా మాస్ ఎలిమెంట్స్ మరియు అలరించే కామెడీ సేతుపతిని ఎంత వరకు గట్టెక్కిస్తాయో చూడాలి.

Rating : 2.5/5