టీం ఇండియా ఓడిపోయింది. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి

Thursday, July 11th, 2019, 04:12:44 PM IST

వరల్డ్ కప్ లో టీంఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనితో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీం ఇండియా సెమీస్ పరాజయంతో ఇంటి ముఖం పట్టింది. నిజానికి మ్యాచ్ కి ముందు ఇండియానే హాట్ ఫేవరేట్ అనే ముద్ర బలంగా ఉంది. పేపర్ మీద కావచ్చు, స్టేడియం లో కావచ్చు న్యూజిలాండ్ కంటే అన్ని విధాలుగా టీం ఇండియా బలంగా ఉంది. కానీ ఊహించని విధంగా ఇండియా ఓడిపోవటంతో అందరు షాక్ అయ్యారు.

ఇక ఈ మ్యాచ్ ఫై దేశ వ్యాప్తంగా దాదాపు 1000 కోట్లు బెట్టింగ్స్ జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో అధికమొత్తం టీం ఇండియా గెలుస్తుందని బెట్టింగ్ కాసినట్లు తెలుస్తుంది. మొదటి రోజు టీం ఇండియా ఆటతీరు చూసి, రెండో రోజు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని భావిస్తూ అధికమొత్తంలో బెట్టింగ్ వేశారు. అలా వేసిన వాళ్ళు దారుణంగా నష్టపోయారు. కొందరు ఏమో దైర్యం చేసి న్యూజిలాండ్ గెలుస్తుందని భావించి బెట్టింగ్ వేశారు. వాళ్ళు భారీగా లాభపడ్డారు.

ఢిల్లీ చుట్టూ పక్క పరిసరాల్లో ఎక్కువగా బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తుంది . అంతే కాకుండా కోహ్లీ, రోహిత్ వ్యక్తిగత స్కోర్ మీద కూడా భారీగానే బెట్టింగ్ లు పెట్టారని తెలుస్తుంది. అలా ఇండియా మీద బెట్టింగ్ లు పెట్టిన కొన్ని లక్షల కుటుంబాలు ఇండియా ఓడిపోవటంతో ఆర్థిక కష్టాల్లో పడినట్లే అని చెప్పవచ్చు. నిజానికి మన దేశంలో బెట్టింగ్ అధికారికంగా చేయటానికి వీలులేదు. అనధికారికంగా సాగే దందా కాబట్టి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కానీ వాటిని కట్టడి చేయలేకపోతోంది.