లైవ్ అప్డేట్స్ : ఐపిఎల్ 2020 వేలం..

Thursday, December 19th, 2019, 08:30:15 PM IST

భారతదేశంలో క్రికెట్ స్పోర్ట్ ను ఎంతలా ఆరాధిస్తారో అందరికీ తెలుసు.అలాగే ప్రపంచ కప్ తర్వాత మన దగ్గర ఆ స్థాయిలో భారీ రెస్పాన్స్ ను రాబట్టింది.టీ 20 ఫార్మాట్ లో సాగే ఐపిఎల్ లీగ్.దేశంలోని పలు రాష్ట్రాలకు దిగ్గజ క్రికెటర్స్ నాయకత్వం వహిస్తూ ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ ఐపిఎల్ మ్యాచుల కంటే ముందే జరిగే వేలంపాటను కూడా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు.అలా ఇప్పుడు 2020లో జరగబోయే ఐపిఎల్ లీగ్ మ్యాచులకు సంబంధించి వేలం పాటలు పాల్గొనబోయే కీలక జట్ల యొక్క స్పాన్సర్స్ మధ్య నడుస్తుంది.అందులో ఎవరెవరిని ఏ జట్టు వారు ఎంతకు సొంతం చేసుకున్నారో చూద్దాం.

 

రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్ళు: రాబిన్ ఊతప్ప, జయదేవ్ ఉనద్కత్, యశస్వి జైశ్వాల్, అనుజ్ రావత్, కార్తిక్ త్యాగి, ఆకాశ్ సింగ్, డేవిడ్ మిల్లర్, ఒషానె థామస్, అనిరుధ్ జోషి, ఆండ్రూ టై, టామ్ కరన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్ళు: ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, జాషువా ఫిలిప్, కేన్ రిచర్డ్‌సన్, పవన్ దేశ్‌పాండే, డేల్ స్టెయిన్, షహ్బజ్ అహ్మద్, ఇసురు ఉదాన
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్ళు: మిచెల్ మార్ష్, విరాట్ సింగ్, ప్రీయం గార్గ్, ఫాబియన్ అలెన్, అబ్ధుల్ సమద్, సంజయ్ యాదవ్, సందీప్ బవనక

 

ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్ళు: క్రిస్ లిన్, నాథన్ కౌల్టర్ నైల్, సౌరభ్ తివారి, మోసిన్ ఖాన్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్, ప్రిన్స్ బల్వంత్‌రాయ్ సింగ్

 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్ళు: గ్లెన్ మ్యాక్స్‌వెల్, షెల్డన్ కాట్రేల్, దీపక్ హుడా, ఇషాన్ పోరెల్, రవి బిషోని, జేంస్ నీషమ్, క్రిస్ జోర్డాన్, తజిందర్ ఢిల్లాన్, ప్రబ్ సిమ్రన్ సింగ్

 

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్ళు: జేసన్ రాయ్, క్రిస్ వోక్స్, అలెక్స్ క్యారీ, షిమ్రన్ హెట్‌మేయర్, మోహిత్ శర్మ, తుషార్ దేశ్ పాండే, మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్

 

కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్ళు: ఇయాన్ మోర్గాన్ (బ్యాట్స్‌మెన్), ప్యాట్‌కమిన్స్ (ఆల్ రౌండర్), రాహుల్ త్రిపాఠి (బ్యాట్స్‌మెన్), వరుణ్ చక్రవర్తి (ఆల్ రౌండర్), సిద్ధార్థ్ (బౌలర్), క్రిస్ గ్రీన్ (ఆల్ రౌండర్), టాం బాంటన్ (బ్యాట్స్‌మెన్), ప్రవీణ్ తాంబే (బౌలర్), నిఖిల్ శంకర్ నాయక్ (వికెట్ కీపర్)

 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్ళు: సామ్ కరన్ (ఆల్ రౌండర్), పియూష్ చావ్లా (బౌలర్), జోష్ హేజిల్‌వుడ్ (బౌలర్), సాయి కిషోర్ (బౌలర్)

 

ఐపీఎల్2020 వేలం ఎట్టకేలకు ముగిసింది. మొత్తం 62 మంది ఆటగాళ్ళను కొనుగోలు చేశారు.

 

రెండు కోట్లు పెట్టి డెయిల్ స్టెయిన్‌ను కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ జట్టు

 

ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మార్కస్ స్టోయినిస్‌ను 4.8 ఓట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగొలు చేసింది.

 

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కొనుగోలు చేసింది. 4 కోట్లు పెట్టి అతడిని జట్టులోకి తీసుకుంది.

 

ఐపీఎల్ 2020 వేలంలో తోలి సెషన్ ముగిసింది. సెకెండ్ సెషన్ మరో గంటలో మొదలుకానుంది.

 

హేజిల్ వుడ్ ను చెన్నై రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

 

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ను సన్ రైజర్స్ 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

 

హిట్టింగ్ లోనే విధ్వంసం సృష్టించగల భారీ హిట్టర్ ‘సిమ్రాన్ హిట్‌మెయర్’ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే హిట్ మేయర్ కనీస ధర రూ. 50 లక్షలు మాత్రమే. కానీ హిట్‌మెయర్ కోసం రాజస్థాన్ రాయల్స్‌ కూడా బాగా పోటీ పడింది. ఆ పోటీలో చివరికీ ఢిల్లీ డేర్ చేసి భారీ మొత్తానికి అతన్ని కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజెల్‌వుడ్ ను చెన్నై రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. కుడి చేతివాటం ఫాస్ట్ మీడియం బౌలర్ అయిన జోష్ వికెట్లను తీయడంలో తెలివైన ప్లేయర్ గా ఇతనికి మంచి పేరు ఉంది.

 

దక్షిణ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్ల‌ర్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

 

వెస్టిండీస్ టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్ షిమ్రోన్‌ హెట్‌మెయర్‌ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 7.75 కోట్లకు దక్కించుకుంది.

 

యంగ్ ప్లేయర్ ఎమ్ సిద్ధార్థ్ ను కోల్ కత్తా కేవలం రూ.20 లక్షలకే కొనుగోలు చేసింది.

 

వెస్టిండిస్ ఆల్‌రౌండర్ షెల్డన్ కాట్రెల్‌ను రూ.8.5 కోట్లకు సొంతం చేసుకున్న పంజాబ్. వికెట్ తీయగానే సైనికుడిలా సెల్యూట్ చేయడం అతడికి అలవాటు.

పియూష్ చావ్లాను రూ.6.75 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై. లెగ్ స్పిన్నర్ అయిన పియూష్ చావ్లా అనుభవం ఉన్న మంచి బౌలర్.

 

ఇండియా అండర్ 19 కెప్టెన్ ప్రియామ్ గార్గ్ ను సన్ రైజర్స్ 1.9 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. గార్గ్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. కష్ట కాలంలో జట్టును ఆదుకునే ఫ్లేయర్ గా అతనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

 

40 లక్షల బేస్ ప్రైజ్ తో ఉన్న దీపక్ హుడాను పంజాబ్ జట్టు 50 లక్షలతో సొంతం చేసుకుంది.

 

యంగ్ క్రికెటర్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న సన్ రైజర్స్ మరో యంగ్ క్రికెటర్ విరాట్ సింగ్‌‌‌ని రూ. 1.9 కోట్లకి దక్కించుకుంది.

 

మరో ప్రతిభావంతమైన క్రికెటర్ రాహుల్ త్రిపాఠిని కోల్ కత్తా రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. అతనికి ఐపీఎల్ లో అపారమైన అనుభవం ఉంది.

 

 

ఈ ఏడాది కోల్ కతా తరపున ఆడిన క్రిస్ లిన్ ను ఈసారి మొట్టమొదటిగా అమ్ముడుపోయాడు.క్రిస్ లిన్ ను ముంబై ఇండియన్స్ వారు అతని కనీస ధర 2 కోట్లకే దక్కించుకుంది.

 

చరిత్రలో మొట్టమొదటి సారి ఇంగ్లాడ్ కు ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను కోల్ కతా వారు 5.25 కోట్లు వెచ్చించి భారీ ధరతో కొన్నారు.

 

భారత్ లో మోస్ట్ అండర్ రేటెడ్ క్రికెటర్ అయిన రాబిన్ ఉతప్పను ఈసారి రాజస్థాన్ జట్టు 3 కోట్లకు దక్కించుకుంది.

 

ఇంగ్లాండ్ ప్రపంచ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ జేసన్ రాయ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోటిన్నరకు సొంతం చేసుకుంది.

 

ఆసీస్ నుంచి మరో విధ్వంసకర బ్యాట్సమెన్ అయిన గ్లెన్ మాక్స్ వెల్ ను మరోసారి పంజాబ్ జట్టు భారీ మొత్తంలో 10.75 కోట్లు తో సొంతం చేసుకుంది.

 

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రికెటర్ క్రిస్ వోక్స్ ను ఢిల్లీ జట్టు 1.5 కోట్లు వెచ్చించి కొనుక్కున్నారు.

 

పాట్ కమ్మిన్స్ జాక్ పాట్ : 2015 లో యువీ తర్వాత పాట్ కమ్మిన్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా నిలిచాడు.కమ్మిన్స్ ను కోల్ కతా టీం 15.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసారు.ఈసారికి ఇదే రికార్డు అంటున్నారు.

 

గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి రెండో సారి రన్నర్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇంగ్లాండ్ యంగ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ను 5.5 కోట్లతో కొనుగోలు చేసారు.

 

క్రిస్ మోరిస్ కు బెంగళూర్ బంపర్ ఆఫర్.దక్షిణాఫ్రికాకు చెందిన ఈ సీనియర్ ఆల్ రౌండర్ క్రికెటర్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అతని కనీస ధర కోటిన్నర మాత్రమే ఉంటే వీరు 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసారు.

 

ఇంకా కీలక సమయాల్లో జట్టుకు మంచి బూస్టప్ ఇచ్చిన యూసఫ్ పఠాన్ మరియు గ్రాండ్ హోమ్ లను ఇంకా ఎవరూ కొనుగోలు చెయ్యలేదు.

 

అలాగే చటేశ్వర్ పుజారా మరియు హనుమ విహారిలను కొనుగోలు చేసేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

 

బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ముష్ ఫికర్ రహీమ్ ను ఇంకా ఎవరు కొనుగోలు చెయ్యలేదని సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ చేస్తున్నారు.

 

షాకింగ్ : విండీస్ కీలక క్రికెటర్ షై హోప్ ను ఎవరూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

 

సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టైన్ ను కూడా ఎవరూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

 

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కేరి కనీస ధర 50 లక్షలు ఉండగా 2.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

 

పేస్ బౌలర్ ఉనద్కద్ ను రాజస్థాన్ రాయల్స్ వారు 3 కోట్లకు సొంతం చేసుకోగా ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.