టీమిండియా జట్టులో మార్పులు.. ఆ ముగ్గురు ఎంట్రీ ఇచ్చేనా..!

Sunday, December 8th, 2019, 05:50:42 PM IST

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరిస్‌లో భాగంగా నేడు రెండవ మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. అయితే మొదటి మ్యాచ్‌లో కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో గ్రాండ్ విక్టరీ అందుకున్న టీమిండియా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ గెలుచుకోవాలని భావిస్తుంది. అయితే అందుకోసం జట్టులో పలు మార్పులును కూడా చేయబోతునట్టు సమాచారం.

అయితే మొన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్ కూడా బ్యాటింగ్‌లో దుమ్ము దులిపి భారీ స్కోరును టీమిండియా ముందు టార్గెట్‌గా పెట్టింది. అయితే వెస్టిండీస్ బ్యాటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు చాహర్ స్థానంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీనీ జట్టులోకి తీసుకుంటున్నారని, ఇకపోతే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశమున్నట్టు తెలుస్తుంది. అయితే రిషబ్ పంత్ లేదా ఆల్‌రౌండర్ శివం దూబే స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.