శ్రీశాంత్ కి భారీ ఊరట… 2020 లో రీ ఎంట్రీ… !

Tuesday, August 20th, 2019, 11:21:32 PM IST

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై పోరాటం చేస్తున్న శ్రీశాంత్ కి భారీ ఊరట లభించింది. జీవితకాల నిషేదాన్ని 7 సంవత్సరాలకి కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కుంటున్న శ్రీశాంత్ ప్రవర్తన బావుందని, జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదించి నట్లుగా నిర్ణయించారు. వచ్చే ఏడాది అనగా 2020 ఆగష్టు కి నిషేధం తొలగిపోనుంది.

నిషేధ కాలంలో ఎలాంటి క్రికె పరమైన కార్యక్రమాలు, మరియు బీసీసీఐ కి కూడా దూరంగానే వున్నాడని, ప్రవర్తన బాగుండటంతో ఏడేళ్ళకి కుదించామని తెలియ చేసారు. తనపై తప్పుడు ఆరోపణలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నా శ్రీశాంత్ కి ఇది ఊరటనే చెప్పాలి. ఫాస్ట్ బౌలింగ్ తో అతి తక్కువ టైంలోనే ఆదరణ కలిగిన క్రికెటర్గా అప్పట్లోనే పేరు గాంచారు. ఏదేమైనా మళ్ళి ఈ బౌలర్ టీంలోకి రావడం అతని ఫాన్స్ కి పండగలాంటి వార్తా అని తెలపాలి.