టీమిండియా డిసీషన్: జైట్లీ మృతికి సంతాపం తెలిపేందుకు కీలక నిర్ణయం..!

Saturday, August 24th, 2019, 07:11:57 PM IST

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ నేడు కన్నుమూసారు. గత కొద్దీ రోజులుగా ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్న అరుణ్ జైట్లీ నేడు తుది శ్వాస విడిచారు. అరుణ్ జైట్లీ న్యాయవాదిగా కీలక పదవులను అనుభవించడమే కాకుండా గతంలో వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేసారు. అయితే తిరిగి 2014లో మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలను వ్యవహరించి రాజకీయాలలో తనకంటూ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.

అయితే నేడు ఆయన మరణవార్త యావత్ భారతదేశాన్ని కలిచివేసిందనే చెప్పాలి. అయితే ఆయన మృతికి సంతాపంగా టీమిండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వెస్టిండిస్‌తో నేడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ళంతా చేతికి నల్ల బ్యాండ్‌లు ధరించి ఆడబోతున్నారు. అరుణ్ జైట్లీ గతంలో ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్‌కు అధ్యక్షత వహించిన నేపధ్యంలో క్రికెట్ కోసం ఆయన అందించిన సేవలకు గుర్తుగా టీమిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెళ్ళడించింది.