రాంచి టెస్టులో అదరగొడుతున్న సెంచరీ వీరులు!

Sunday, October 20th, 2019, 11:08:21 AM IST

రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్నా మూడో టెస్ట్ మ్యాచ్ లో అజింక్య రహానే సెంచరీ పూర్తీ చేసాడు. ఇప్పటికే రోహిత్ శర్మ ఈ టెస్ట్ మ్యాచులో సెంచరీ చేయగా భారత్ భారీస్కోరు దిశగా పరుగులు తీస్తుంది. డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో అద్భుతంగా రాణిస్తున్నారు. మొదటి సెషన్ లో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా రోహిత్ మరియు రహానే లతో గాడిలో పడిందని చెప్పొచ్చు. రహానే టెస్ట్ కెరీర్ లో ఇది 11 వ శతకం కాగా, భారత్ లో నాల్గవ శతకం. మొత్తానికి దక్షిణఫ్రికా పై మూడో శతకం.

రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్దీ సేపటికే రహానే సెంచరీ సాధించడం విశేషం. మొదటి రోజు టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న భారత్ మూడు వికెట్లను తొందరగా కోల్పోయింది. కష్ట సమయం లో ఆపద్బాంధవుడులా రోహిత్ శర్మ ఆదుకోగా రహానే కూడా సెంచరీ చేయడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తుంది. దక్షిణాఫ్రికా తో జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విజయాన్ని పొందగా, వైట్ వాష్ తో సిరీస్ ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఇంకెన్ని రికార్డులని క్రియేట్ చేస్తుందో చూడాలి.