డిసీషన్ చేంజ్: రాయుడు మళ్ళీ టీమిండియాలోకి రాబోతున్నాడుగా..!

Saturday, August 24th, 2019, 05:26:53 PM IST

తెలుగు క్రికెటర్, టీమిండియా ఆటగాడు ఈ ఏడాది జూలైలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వరల్డ్‌ కప్‌ జట్టుకు తనను ఎంపిక చేయకపోవడంతో అంబటి రాయుడు తీవ్ర నిరాశకు గురికావడంతో తాను క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసాడు. అయితే వరల్డ్ కప్‌కి ఎంపిక కాలేదన్న కోపమే అతడి రిటైర్‌మెంట్‌కి కారణమని ఏదేమైనా రాయుడు మరి కొద్ది రోజులు వేచి ఉండాల్సిందని అప్పట్లో క్రికెట్ అభిమానులు, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున బాధపడ్డారు.

అయితే తాజాగా అంబటి రాయుడు తన రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. అప్పడు వరల్డ్‌కప్‌లో చోటు కోసం చాలా పరితపించానని అయితే నాకు ఆ అవ్కాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని అందుకే అప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించానని, ఆవేశంలో మాత్రం ఆ నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. రిటైర్మెంట్‌ తరువాత తాను మళ్ళీ ఆలోచించానని భారత్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతానని, ఐపీఎల్ లో కూడా తాను ఆడేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాడు. అయితే జట్టులో స్థానం కోసం తొందరపడకుండా నిదానంగా ముందుకు వెళ్తానని జట్టులో చోటు దక్కే వరకు వేచి చూస్తానని అన్నాడు.