బ్రేకింగ్ న్యూస్ : రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడబోతున్న అంబటి రాయుడు

Friday, August 30th, 2019, 11:50:48 AM IST

టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మొన్నటి వరల్డ్ కప్ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. వరల్డ్ కప్ జట్టులో స్థానం లభించకపోవటంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఆ తర్వాత జట్టులో ఇద్దరు ఆటగాళ్లు గాయపడిన కానీ, స్టాండ్ బై గా ఉన్న తనని పంపకుండా వేరే ఆటగాళ్ళని పంపటంతో రాయుడు మానసికంగా చాలా వీక్ అయ్యాడు. దీనితో ఇక క్రికెట్ లో కొనసాగటం అనవసరమని భావించి రిటైర్మెంట్ ప్రకటించాడు.

రాయుడు నిర్ణయంతో ప్రతి క్రికెట్ అభిమాని బాధపడ్డాడు. రాయుడుకి అన్యాయం జరిగిందని అందరు ఆవేదన చెందారు. ఇక రాయుడు మళ్ళీ గ్రౌండ్ లో కనిపించడేమో అని అనుకున్నారు . కానీ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు ఈ సీజన్‌లో హెచ్‌సీఏ నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాడు. హెచ్‌సీఏ వన్డే, టి20 క్రికెట్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని చెప్పాడు.

మరి కేవలం హెచ్‌సీఏ వన్డే, టి20 క్రికెట్‌ మ్యాచ్‌ లకు మాత్రమే అందుబాటులో ఉంటాడా..? లేదా ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలు కూడా ఆడుతాడా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ సీజన్‌లో లో రాయుడు అదరకొడితే వచ్చే టోర్నీలో అతను మళ్ళీ మెరిసే అవకాశం ఉంటుంది. ఈ సీజన్ లో మంచి స్కోర్ చేస్తే అతనిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంది. దానితో మరి కొన్నేళ్లు ఆటలో కొనసాగవచ్చు