షమీకి అరెస్ట్ వారెంట్ ..15 రోజుల్లో లొంగిపోవాలి

Tuesday, September 3rd, 2019, 09:20:27 AM IST

టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ షమీకి ఊహించని విధంగా కోర్టు షాక్ ఇచ్చింది. మహ్మద్ షమీ అతని సోదరుడు హాసిద్ అహ్మద్ కు కోల్ కతా లోని ఆలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. షమీ భార్య హసీనా గతంలో షమీ మీద కేసు పెట్టిన విషయం తెలిసిందే, షమీకి అక్రమ సంబంధాలు ఉన్నాయని, అనేక మంది యువతుతో రిలేషన్ కొనసాగిస్తున్నాడని, ఈ క్రమంలో తనని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని 2018 లో పోలీస్ కేసు పెట్టి పెను దుమారం లేపింది.

తాజాగా దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ 15 రోజుల్లోపు కోర్టు ముందు హాజరు కావాలని, అలాగే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజులు సమయం కూడా ఇచ్చింది. షమీకి వచ్చిన నోటీసులపై BCCI స్పందిస్తూ, మా న్యాయ శాఖ అధికారులు షమీ మీద వచ్చిన చార్జిషీట్ ని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తాం, అప్పటిదాకా అతని విషయంలో మేము ఎలాంటి చర్యలు తీసుకోబోమని సృష్టం చేశారు.

2018 లో షమీ మీద ఇదే స్థాయిలో ఆరోపణలు రావటంతో BCCI అతనికి అండగా నిలబడింది. బ్యాక్ ఎండ్ నుండి అతనికి న్యాయ సహాయం కూడా చేయటమే కాకుండా, టీం లో మంచి అవకాశాలు ఇచ్చి, మానసికంగా అతనికి మోరల్ సపోర్ట్ ఇచ్చింది. టీం ఇండియా వరల్డ్ కప్ లో సాధించిన విజయాల్లో షమీ పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు కూడా మరోసారి BCCI షమీకి అండగా నిలబడే ఛాన్స్ లు ఉన్నాయి.