క్రికెట్ ప్రపంచం లో కోహ్లీ కంటే గొప్ప ఆటగాడు లేడు .

Friday, September 13th, 2019, 05:10:13 PM IST

డీడీసీఏ అధ్యక్షుడు ఒక కార్యక్రమంలో విరాట్ కోహ్లీ గురించి అరుణ్ జైట్లీ ఎపుడు చెప్పే మాటలను ప్రసంగించారు. తన తండ్రి మరణించినపుడు కూడా తాను క్రికెట్ ఆడడానికి వెళ్లాడని, క్రికెట్ ప్రపంచం లో కోహ్లీని మించిన ఆటగాడు లేడని అరుణ్ జైట్లీ ఎపుడు అంటూ ఉండేవారు అని డీడీసీఏ అధ్యక్షులు అన్నారు. అనుష్క, విరాట్ కోహ్లీ హాజరైన ఓ కార్యక్రమంలో వీరి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

ఫిరోజ్ షా కోట్ల స్టేడియానికి దివంగత మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు ప్రకటించారు. అక్కడ ఒక స్టాండ్ కి విరాట్ కోహ్లీ పేరు పెట్టగా కోహ్లీ భావోద్వాగానికి గురుయ్యారు. విరాట్ కోహ్లీ చేతిని అనుష్క ముద్దాడిన చిత్రం ఇపుడు ఇంటర్నెట్లో హల చల్ చేస్తుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నారు.