వచ్చే ఏడాది కి వాయిదా పడిన ఆసియా కప్ 2020

Friday, July 10th, 2020, 01:14:56 AM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో చాలా రంగాలు నెమ్మదించాయి. ముఖ్యంగా క్రికెట్ మరియు సినిమా రంగాలకు పెద్ద దెబ్బ పడింది అని చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా ఇప్పటి వరకూ దేశం లో ఐపియల్ కూడా జరగలేదు. తాజాగా ఆసియా కప్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ కప్ నిర్వహించడం వలన ఆటగాళ్ళు కరోనా వైరస్ భారిన పడి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉండటం తో ఈ కప్ ను వాయిదా వేయడం జరిగింది.

అయితే వచ్చే ఏడాది జూన్ కి ఆసియా కప్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని పై ఆసియా క్రికెట్ కౌన్సిల్ సైతం ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ కి బదులుగా వచ్చే ఏడాది శ్రీలంక దేశం ఈ ఆసియా కప్ కి అతిద్యం ఇవ్వనుంది.2021 కప్ కి గాని శ్రీలంక దేశం అతిద్యం ఇవ్వాల్సి ఉండగా, 2020 కి పాకిస్తాన్ దేశం ఇవ్వాలి. అయితే ఏసీసీ ఇలా నిర్ణయం తీసుకోవడం తో క్రికెట్ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఈ ఏడాది ఆసియా కప్ లేకపోవడం తో రద్దు అయింది అని గంగూలీ సైతం తెలిపారు.