తమ జట్టు ఆటగాళ్ళ కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఏం చేశాడంటే..!

Thursday, October 24th, 2019, 10:20:18 PM IST

సాధారణంగా క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. గల్లీ నుంచి దేశవాళి వరకు క్రికెట్ ఆటకున్న క్రేజ్ వేరే ఏ ఆటకు లేదనే చెప్పాలి. చిన్న చిన్న మ్యాచ్‌లనే పని కట్టుకుని స్టేడియంలో కూర్చొని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు బారులు తీరుతుంటారు. అయితే తమ అభిమాన జట్టు ఇక మైదానంలో పోరాడుతుందంటే ఎలాగైనా గెలవాలని స్టాండ్స్‌లో కూర్చోనే ఆటగాళ్ళను ఎంకరేజ్ చేస్తుంటారు అభిమానులు.

అయితే అలాంటి ఎంకరేజ్‌మెంట్ తమ దేశ జట్టు ఆటగాళ్ళకు ఆ దేశ ప్రధాని అందిస్తే ఎలా ఉంటుంది, అది కూడా స్టేడియంలోకి స్వయంగా ఆ దేశ ప్రధానే డ్రింక్స్ తీసుకువెళ్ళి ఆటగాళ్ళకు అందించి మరీ ఆల్ ది బెస్ట్ చెబితే ఎలా ఉంటుంది. ఇంకేముంది ఆ జట్టుకు ఖచ్చితంగా గెలవాలనే కసి ఏర్పడుతుంది. అయితే అదే జరిగింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిస్సన్ అదే పని చేశారు. దేశవాళి క్రికెట్‌లో శ్రీలంక జట్టుతో పోటీ పడిన పీఎంXఈ టీం ఒక వికెట్ తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.