సెంచరీలతో కదం తొక్కిన ఆసీస్ ఓపెనర్లు.. టీమిండియాకు తప్పని ఓటమి..!

Tuesday, January 14th, 2020, 09:06:16 PM IST

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్‌డే మ్యాచ్ సిరిస్‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్‌కి ఈ మ్యాచ్ కలిసొచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో ధావన్ 74 (91 బంతులలో), రాహుల్ 47 (61 బంతులలో) తప్పా మిగతా బ్యాట్‌స్మెన్స్ ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో టీమిండియా 255 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కి ఓపెనర్లే విజయాన్ని అందించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 128 (112 బంతులలో), ఫించ్ 110 (114 బంతులలో) పరుగులతో చెలరేగడంతో 37.4 ఓవర్లలోనే ఆసీస్ లక్ష్యాన్ని చేధించింది. ఏదేమైనా ఆసీస్ ఓపెనర్ల ధాటికి టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారనే చెప్పాలి. అయితే ఇరు జట్ల మధ్య ఈ నెల 17న రాజ్‌కోట్‌లో రెండవ మ్యాచ్ జరగనుంది.